Type Here to Get Search Results !

సిఫ్ఫ్నర్ (Siffner) ను అనుసరించి ప్రభుత్వ పాలనా పరిధి

0

 సిఫ్ఫ్నర్ (Siffner) ను అనుసరించి ప్రభుత్వ పాలనా పరిధిని రెండు రకాలుగా క్రింద విభజించవచ్చు.

  1. ప్రభుత్వ పాలన సిద్ధాంతములు (Principles of public Administration)

  2. ప్రభుత్వ పాలన మండలము (Sphere of public Administration) మొదటిదైన ప్రభుత్వ పాలన సిద్ధాంతములో ఈ క్రింది సమస్యలు అధ్యయనం చేయబడతాయి.

  3. వ్యవస్థీకరణ (Organization) : దీని అర్థం ట్రేబునలలు ఏర్పరుచుట, నిబంధనలు, కార్యకలాపాలకి సంబంధించి రూపొందించడం (Which means the structuring of individuals and functions into productive relationship).

  4. ఉద్యోగుల నిర్వహణ (Management of personnel) : అంటే వ్యవస్థలో నిర్వహించబడిన లక్ష్యాలు మరియు ఆ లక్ష్యాల వైపు ఉద్యోగులని నిర్దేశించడం (Which is 'concerned' with the direction of those individuals and functions to and previously determined).

  5. పద్ధతి ప్రక్రియ (Method and Procedure) : ఇది పరిపాలనా పద్ధతులను సంబంధం. అంటే పరిపాలనని ఏ విధంగా అమలుచేయబడిందీ తెలుపుతుంది.

  6. సామగ్రి మరియు వస్తు సప్లై (Material and Supply) : ఇది పరిపాలన పనులు నిర్వహించుటకు సహాయపడుతుంది. ఉదా: కలం, సిరా, కాగితం మరియు, ఇతర వస్తు సప్లై.

  7. పబ్లిక్ ఫైనాన్స్ (Public Finance) : ఇది (నిర్ణయాలు) టేకుబందికి సంబంధించిన వాటికి ఉంటుంది. దీనిని బడ్జెటింగ్ అని కూడా అంటారు.

  8. పరిపాలన జవాబుదారీ (Administrative Accountability) : అంతర్గత నియంత్రణలకి అనుగుణంగా న్యాయపరమైన, రాజకీయపరమైన, ప్రభుత్వము జరిపే మాధ్యమం.

రెండవదైన ప్రభుత్వ పాలన మండలంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల అధ్యయనం ప్రభుత్వ పాలనలో చేయబడుతుంది.

ప్రభుత్వ పాలనా పరిధిని రెండు భాగాలుగా విభజించి, ఇంకో విధంగా విభజించవచ్చు.

  1. పాలన సిద్ధాంతం (Administrative theory)

    1. అనువర్తిత పాలన (Applied Administration)

    1. పాలన సిద్ధాంతం (Administrative theory) : అన్ని స్థాయిలలో పాలన నిర్వహణకి, ప్రభుత్వాని యొక్క విధులు, నిర్ణయం, వ్యవస్థీకరణ, పద్ధతి, మరియు ఇతర వివరాల అధ్యయనం ఇందులో చేయబడుతుంది. (అంటే కార్యాలయం, ప్రణాళికలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు చట్టాలు, ఒకరి నుండి మరొకరి మధ్య అధికారము, మంత్రిమండలి బాధ్యతలను, అధికారులుగా ప్రాధాన్యతని, సమస్య పరిష్కారము, సంస్థల నిర్మాణం, ప్రణాళికలు, ప్రణాళికా రచన, ప్రభుత్వ కార్యకలాపాల పద్ధతులు, వాటిని అమలు చేయుట, ఇవన్నీ ఇందులో ఉంటాయి.) వాటికి సంబంధించిన సమస్యలు, పర్యవేక్షణ, సమాచారం, పీరియాడికల్స్ మొదలగు సమస్యల అధ్యయనం ఉంటుంది. కొన్ని పరిపాలనా సంస్థల నిర్మాణం తెలుసుకోవడం, వాటిని నైపుణ్యం కోసం ప్రయత్నించడం ఇందులో ఉంటాయి.

    1. అనువర్తిత పాలన (Applied Administration) : అనువర్తిత పాలనలో ఏ విధంగా చేస్తారు. ఒక రంగం నుండి మరొక రంగానికి భిన్నంగా ఉంటుంది. చాలా ప్రముఖమైన పాలన సిద్ధాంతాలైన వాకర్ (Walker) అనువర్తిత పాలన ముఖ్యమైన విభాగాలను క్రింద విభజించినాడు. ఇవి రాజకీయ శాసన, ద్విత్వ, విద్య, పన్నులు, విదేశీ, పారిశ్రామిక, స్థానిక విధులు.

    ఈ క్రింది విధంగా వివరాలు అయినవి వివరాలు.

    (i) రాజకీయమైనది (Political) : ఇందులో కార్యనిర్వాహక శాఖకు సంబంధం. అంటే మంత్రి మండలి - రాజకీయ పాలన కార్యకలాపాలు, మంత్రులు - అధికారులు సంబంధాల అధ్యయనం చేయుట.

    (ii) శాసనపరమైనది (Legislative) : ఇందులో దత్తాంశాన్ని బిల్లులను తయారు చేయుట. అంటే ఉద్యోగులు చేయు కృషి మొదలగునవి ఉంటాయి.

    (iii) విత్త సంబంధము (Financial) : ఇందులో ద్రవ్య వ్యవహారాలకి మాత్రం ఉంటుంది. అంటే బడ్జెటును రూపొందించడం మరియు శాసనం చేయుటకుకు సంబంధించినవి.

    (iv) రక్షణ సంబంధం (Defensive) : ఇందులో సైనిక పాలన అధ్యయనం ఉంటుంది.

    (v) విద్యాసంబంధం (Educational) : ఇందులో విద్యావేత్తల అంశాలకి ఉంటుంది.

    (vi) సాంఘిక సంబంధం (Social) : సాంఘిక రంగానికి సంబంధించినవి. గుత్తా నిర్మాణం, అపోహలు, సాంఘిక భద్రత మొదలగునవి ఉంటాయి.

    (vii) ఆర్థిక సంబంధం (Economic) : ఆర్థిక రంగంలోని కార్యకలాపాలని పొందుతాయి. అంటే పరిశ్రమలు, వ్యవసాయం, పశుపోషణ, వ్యాపారం మొదలగునవి.

    (viii) విదేశీ సంబంధం (Foreign) : ఇందులో విదేశీ వ్యవహారాలు చేయటం. అంటే అంతర్జాతీయ సమాచారం, కాంట్రాక్టులు, విదేశీ పర్యటనలు మొదలగునవి.

    (ix) సామ్రాజ్యవాద సంబంధం (Imperial) : ఇందులో ఇతర దేశాలపై సామ్రాజ్యవాదానికి సంబంధించిన సమస్యలుంటాయి.

    (x) స్థానిక సంబంధం (Local) : ఇందులో స్థానిక పాలన ఉంటుంది.

    వాకర్ (Walker) చేసిన విభజనలో చాలా అతివ్యాప్తి (over lapping) ఉన్నప్పటికీ సులభంగా అనువర్తిత పాలన సిద్ధాంతం విద్యార్థులకి ఉపయోగకరం. అనువర్తిత పాలన సంక్షిప్తంగా చెప్పాలంటే ప్రపంచంలోని వివిధ దేశాల పాలన, అడ్మినిస్ట్రేషన్ యొక్క రంగాలు మరియు వివిధ పద్ధతుల అధ్యయనం ఇందులో ఉంటుంది. అందువలన ప్రతి ప్రభుత్వ పాలనా కార్యకలాపాలు అత్యంత ముఖ్యమైనవిగా పరిగణించి, ప్రతి ఉద్యోగుల పద్ధతులు సంబంధించు సమస్యలు పరిష్కరిస్తారు.

    రాజ్య లక్ష్యాలను, ప్రణాళికలను, విలువలు ప్రస్ఫుటంగా చేయడం కూడా ప్రభుత్వ పాలన పరిధిలో ఒక భాగము. రెండు దృక్పథాలు, డిమాక్ (Dimock) మరియు కోయనింగ్ చేసిన విభాగం - పోస్డ్‌కార్బ్ (POSDCORB) సిద్ధాంతం, ప్రభుత్వ పాలన విస్తరించడం - ఇవన్నీ ప్రభుత్వ పాలన పరిధిని పెంచుతున్నాయి. ఒక దేశంలో ప్రభుత్వ పాలన చట్టము- శాసనానికి ప్రస్ఫుటంగా ఉంటుంది. ప్రజలకు మేలుచేయడం, అభివృద్ధి, ప్రజాక్షేమం కోసం పాటుపడటం వలన ప్రభుత్వ పాలన యొక్క భాగం పనులకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి సమర్ధిస్తున్నది. నేటి ప్రజల ప్రభుత్వాలకి అందించే సేవలు (Services), నిద్ర లేకుండ ఉన్నా, సామాజిక భద్రత, న్యాయ పాలనలో ప్రజలకు ఉన్న కొన్ని సమస్యలకి, సాంఘిక ఆర్థిక సమస్యలు పరిష్కరించడం, ఆరోగ్యం మెరుగుపడటం, దేశ భద్రత, యుద్ధం, సమాచారం, వనరులను వినియోగించటానికి నిబంధనలను పాటించడం, వివిధ కార్యకలాపాలకి ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వ పాలన చాలా ముఖ్యమైన భాగంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రభుత్వం పరోక్షంగా పనిచేసే అనేక కార్యకలాపాలకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యత వహిస్తుంది.

    1.5 ముగింపు

    ఈ విధంగా చూసినట్లయితే ప్రభుత్వ పాలన ఒక విస్తృతమైన, ప్రభావశీలమైన శాస్త్రం. ప్రభుత్వ పాలనలో న్యాయశాస్త్ర పరిపాలన, ప్రభుత్వ పాలన శాస్త్రంలో ఒక ముఖ్యమైన విభాగంగా ఉంది. ఈ అధ్యయనానికి 1887 సంవత్సరంలో వుడ్రో విల్సన్ (Woodrow Wilson) ఒక పరిశోధన పత్రాన్ని ప్రచురించి ప్రభుత్వ పాలన ఒక స్వతంత్ర శాస్త్రమని ప్రపంచానికి తెలియజేశారు. అందువలన రాజ్యాలు ప్రజలకు దాదాపుగా అందించవలసిన అన్ని రకాల సేవలను, ప్రజలకు ప్రభుత్వంలో ఉన్న అధికారుల పద్ధతిలో అంతర్లీనంగా ఉండే సమస్యలు మరియు ప్రభుత్వ పాలనా యంత్రాంగం, ప్రభుత్వ పాలన అధ్యయనంలో ముఖ్యమైనదిగా ఉంది. ప్రభుత్వ పాలన దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో ఒక ముఖ్యమైన సాధనంగా ఉంది. అందువలన నేడు ప్రపంచమంతటా ఈ శాస్త్రం యొక్క అధ్యయనం ప్రాధాన్యతనిచ్చి చేయబడుతుంది.

    1.6 మాదిరి ప్రశ్నలు

    దీర్ఘ సమాధాన ప్రశ్నలు

    1. ప్రభుత్వ పాలనను నిర్వచించి, పరిధిని చర్చించుము.

    2. ప్రభుత్వపాలన స్వభావమును వివరించుము.

    లఘు సమాధాన ప్రశ్నలు

    1. అవిచ్ఛిన్న దృక్పథము (Integral view).

    2. నిర్వహణ దృక్పథము (Managerial view).

    3. పోస్డ్‌కార్బ్ (POSDCORB).

    4. పరిపాలన సిద్ధాంతము (Administrative theory).

    5. అనువర్తిత పాలన (Applied Administration).

Post a Comment

0 Comments