Type Here to Get Search Results !

సమాజిక శాస్త్రము వర్ణణాత్మకం

0

 సాంప్రదాయక దృక్పథం చాలా వరకు పాశ్చాత్యాదేశాల ప్రజాస్వామ్య సంస్థల సాధారణ లక్షణాలను వర్ణించటానికే పరిమితం అయింది. అనేకమైన రాజకీయ వ్యవస్థల సామాన్య స్థితిగతులను సాధారణీకరించటానికి అది ఎలాంటి ప్రయత్నం చేయలేదు. బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, స్విట్జర్లాండ్, లియా, కెనడా మొదలగు పాశ్చాత్య ఉదారవాద ప్రజాస్వామ్యం నమూనాను వివరించటానికే సాంప్రదాయ దృక్పధం ప్రయత్నించింది. విభిన్న దేశాల మధ్య తులనాత్మక అధ్యయనాలు జరిగినప్పటికీ, కేవలం ప్రభుత్వాలను అధ్యయనం చేయటం వరకే సాంప్రదాయ దృక్పధ పద్ధతులు పరిమితమైంది. విభిన్న సమాజాల రాజకీయాల మధ్య సారూప్యతలు, వైవిధ్యాలు, వ్యత్యాసాలను అది ఎక్కువగా పరిగణనలోనికి తీసుకొనలేదు

పాశ్యాత్య రాజ్యాలని రాజ్యాంగాలను, ప్రభుత్వం గల అధికార విధులను వర్ణించుటకే అధిక ప్రాధాన్యతను ఇచ్చినది. రాజకీయ వ్యవస్థల చోదశక్తులైన సామాజిక ఆర్థికాంశాలను చాలా వరకు సాంప్రదాయ దృక్పధం నిర్లక్ష్యం చేసింది. ఉదా॥ రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు, ఓటర్ల ప్రవర్తన మొ॥లగు రాజకీయ ప్రక్రియలలోని కీలకాంశాలు రాజనీతి విశ్లేషణలలో చాలా ప్రధానమైనవి. వీటిని కూడా అది నిర్లక్ష్యం చేసింది. అంతేకాకుండా సాంప్రదాయ దృక్పధం చాలా వరకు వర్ణనకే ప్రాధాన్యమిచ్చింది. చాలా రచనలు, లాంఛన ప్రాయమైన సంస్థల ప్రభుత్వ నిర్మితుల సాధారణ అధ్యయనానికే పరిమితమయ్యాయి.

సాంప్రదాయక దృక్పధం చాలా వరకు చారిత్రకంగా లేదా చట్టబద్దంగా రూపొందిన అంశాలకే ప్రాధాన్యమిచ్చి అధ్యయనం చేసింది. రాజ్యాంగ నిబంధనలు, వివిధ చట్టాలు, అవి రూపొందించటానికి దారితీసిన పరిస్థితులు, అందులోని అంశాలు, లాభనష్టాలు,అధ్యయనాల్లో ప్రధాన స్థానమాక్రమించాయి. ఈ సందర్భంలో సమాక్యవాదం (Federations) అధ్యయనాన్ని ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, స్విట్జర్లాండ్ దేశాలలో సమాఖ్య రాజ్యాంగాలు ఏ విధంగా ఉన్నాయన్న వర్ణనకే సాంప్రదాయ పద్దతి ప్రయత్నించింది. ఆయా దేశాలలోని సామాజిక ఆర్ధిక పరిస్థితులు ఏ విధంగా వివిధ సమాజాల్లో వైరుధ్యాలకు దోహదం చేస్తాయో విశ్లేషించటంలో అది విఫలమయినది.

      సాంప్రదాయక దృక్పధము "యూరో కేంద్ర” భావనలకే పరిమితమైంది. కేవలం పాశ్చాత్య యూరోపి అనుభవాలే అనుభవవాద : రిశోధనకు సిద్ధాంతీకరణకు ప్రాతిపదికలయ్యాయి. యూరోపియనేతర అనుభవాలు రాజనీతి అధ్యయన పరిధిలోకి రాలేదు. అలాగే నిత్య జీవితంలో ప్రజలు ఎదుర్కొనుచున్న సాంఘిక, ఆర్ధిక, సమస్యలు అధ్యయన పరిగణలోకి రాలేదు.

రాజకీయ హేతువును అధ్యయనము చేయుటలో సాంప్రదాయక పద్ధతులను ఉపయోగించారు. ఈ దృక్పథాలు చాలా వరకు పాశ్చాత్య సమాజాలు, ప్రభుత్వాలు గురించి అధ్యయనం ఉండేది. పైనుదహరించిన సాంప్రదాయక దృక్పథాల లక్షణాలను అనుసరించి, కొన్ని ప్రధానమైన సాంప్రదాయక దృక్పధాలను ఈ కింద క్లుప్తంగా వివరింపబడినవి.

ఈ దృక్పధాన్ని ప్లేటో, రూసో, హెగెల్ మొదలగు వారు ఉపయోగించారు. ఈ దృక్పధం రాజనీతి శాస్త్రంలో మానవ నైజాన్ని, ఒక నిర్దుష్ట భావాల నుండి ప్రారంభించి దాని నుండి రాజ్య స్వభావము, లక్ష్యాలు, విధులు, భవిష్యత్తులను గుర్తిస్తుంది. వివిధ భావాలను అధ్యయనం చేసి వాటిలో ఏవి ఎక్కువగా ఆచరణలో వుంటాయో కనుగొనుటకు ప్రయత్నిస్తుంది. రాజ్యం పట్ల పౌరుడు ఎందుకు విధేయత చూపాలి? అనే ప్రశ్నలను, నైతిక విలువలను ప్రభోదిస్తుంది. తాత్వికవైఖరి ఒక రాజకీయ సమాజంలో పాలకులు, పాలితులు అంతా ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలంటుంది.

ప్రభుత్వ వ్యవస్థలు చారిత్రక లేక శాసన పరమైన పద్దతుల్లో అధ్యయనం చేయబడ్డాయి. ఈ అధ్యయనాల్లో పాశ్చాత్య ప్రజాస్వామ్యాల రాజకీయ సంస్థలు, వ్యవస్థలు లాంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వబడేది. తూర్పుదేశాలను ఆచరణలో పూర్తిగా విస్మరించటం జరిగింది. రాజనీతి సిద్ధాంతపు సూత్రాలను చరిత్ర, న్యాయశాస్త్రం, నీతి శాస్త్రం, తత్వ శాస్త్రం సహాయంతో రూపొందింపబడేవి. ఈ దృక్పధం సూత్రప్రాయ రాజకీయ సిద్దాంత సాహిత్యానికి ప్రముఖంగా దోహదం చేసింది. ఒకవైపు సాంప్రదాయ పద్ధతిలో ప్లేటో, కాంట్, హెగెల్లు రాజ్యాన్ని ఆదర్శీకరించగా, మరోవైపు అరిస్టాటిల్, హాబ్స్, మాకియావెల్లీలు మరింత వాస్తవికంగా ఆలోచించి, నిర్వహణలో ఉండవలసిన రాజ్యాంగ సిద్ధాంతాలను రూపొందించారు.


చారిత్రక దృక్పథం కొంతవరకు రాజకీయ అనుభవాలను అధ్యయనం చేయటానికి ఉపకరించింది. జర్మన్ జాతీయవాదాన్ని భావవర గతి తార్కిక ప్రక్రియ ద్వారా అధ్యయనం చేసినా హెగెల్, చైనా, ఇండియా, పర్షియా, ముస్లిం ప్రపంచాన్ని ప్రాచీన మధ్య యుగాల పాశ్చాత్య చరిత్రను విశ్లేషించారు. చారిత్రక దృక్పథాన్ని అవలంబించిన వారు మాంటిస్క్యూ, సావలీ, హెరాల్టు లాస్కీ ముఖ్యులు రాజనీతి శాస్త్రం, చట్టానికి మధ్య ఉన్న సంబధాన్ని గ్రోషియస్, బెంథాం. ఆస్టిన్, డైసీలు వివరించారు. సాంప్రదాయక దృక్పథంలో అధ్యయనం చేసిన శాస్త్రజ్ఞులు వ్యక్తి స్వేచ్ఛ, సమానత్వం, సార్వభౌమాధికారం, హక్కులు బాధ్యతలు, రాజకీయ బద్ధత, ప్రభుత్వాంగాలు, రాజ్యాంగము మొదలగు అంశాలపై మాత్రమే దృష్టిని కేంద్రీకరించారు. అయితే ఈ దృక్పధం చాలా కాలం ఆచరణలో ఉండి, అందుబాటులో ఉన్న సాక్ష్యాల ద్వారా రాజకీయ సంస్థలను పరిశీలించారు ఈ దృక్పథము తులనాత్మకం కానటువంటిది. తులనాత్మకత కంటే వర్ణనాత్మక అధ్యయనం చారిత్రకంగానో, న్యాయపరంగానో ఉండేది.


చారత్రక దృక్పధం కొన్ని సంస్థల పుట్టుకలను, ఆ వ్యవస్థల పరిణామము, ప్రజల ఆచార సాంప్రదాయములకు ప్రాధాన్యత ఇవ్వగా, న్యాయపరమైన దృక్పధం ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల అధికారాలు, విధులు అమలులో ఉన్న రాజ్యాంగ, న్యాయపరమైన అంశాల పరంగా వాటి సంబంధాలకు ప్రాధాన్యం ఇచ్చేది ఈ దృక్పధాన్ని అధ్యయనం చేసిన రాజనీతిజ్ఞులలో హెచ్.జె. లాస్కీ, సి.యమ్. స్క్రాంగ్, జేమ్స్ బ్రైస్, బియస్ ముఖ్యులు. పార్టీ వ్యవస్థ పుట్టుక, అభివృద్ధి, ప్రభుత్వాంగాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల నిర్మాణము, పరిణామము, విధులను గూర్చి వివరించిరి.


2.9 ఆధునిక దృక్పథం


రాజనీతిశాస్త్ర అధ్యయనంలో రాజనీతి శాస్త్రజ్ఞులు వివిధ దృక్పధాలను, పద్ధతులను ఉపయోగించినారు. వాటిలో ఆధునిక పద్దతి ఒకటి. సాంప్రదాయక అధ్యయనములో పరిశీలించినా కేవలము తాత్విక, నైతిక, సంస్థ, నిర్మాణము, చారిత్రక మరియు న్యాయపరమైన అంశాలు మాత్రమే తెలియును. కాని వాటి ఉద్దేశ్యములు, లక్ష్యములు తెలియవు. అవి తెలుసుకొనుటకు ఆధునిక అధ్యయనం అవసరం. ఈ ఆధునిక అధ్యయనము ముఖ్యముగా విషయ సేకరణ మీద ఆధారపడుతుంది. దీనిని డేవిడ్ ఈస్టన్ (David Easton) వంటి వారు విశ్లేషించారు. ఈ ఆధునిక అధ్యయనమునకు సాపేక్ష విలువలు లేనప్పుడు సాధ్యం కాదు. మరియు దీనికి అనుగుణమైన గణన (Relevant Data) ఉండవలయును. వీటిని శాస్త్రజ్ఞులు వివిధ కాలమాన పరిస్థితులకు అనుగుణముగా ఉపయోగించి రాజ్యవ్యవస్థతో బాటు అనేక ఇతర అంశములను కూడా వారు అధ్యయనము చేయుచున్నారు. ఆధునిక దృక్పథాలకు కొన్ని లక్ష్యములు అవి 

. తులనాత్మక అధ్యయన స్వభావము కలదు.


2). విశ్లేషణాత్మక మరియు అనుభవవేద్యదర్యాప్తులు,


3). మౌలిక సదుపాయలను అధ్యయనము చేయుట.


4). 5 2 (Inter Disciplinary methods).


ఆధునిక దృక్పధాల్లో తులనాత్మక దృక్పధం, ప్రవర్తనావాద దృక్పధం, వ్యవస్థల దృక్పధం, నిర్మితులు- విధుల దృక్పధం, ఉత్పాదక- ఉత్పాదిత దృక్పధము, మార్క్సిస్టు దృక్పధం ముఖ్యమైనవి. కాబట్టి ఈ దిగువ ఇవ్వబడిన ఆధునిక దృక్పధాలను పరిశీలించుట సమంజసము.


2.9.1 తులనాత్మక దృక్పధం


తులనాత్మక పద్ధతి అనగా విభిన్న పరిస్థితులలో, అన్నికాలాలలో భిన్న దేశాలలో నివసించే ప్రజల మధ్య వుండే వ్యత్యాసాలను, సమస్యలను వివరించి, విశ్లేషించి, మూల సిద్ధాంతాలను రూపొందించుట అని చెప్పవచ్చును. తులనాత్మక పద్దతి, రాజనీతిశాస్త్రం అధ్యయనంలో ప్రముఖమైనది. రాజనీతి శాస్త్రవేత్త తాను మొదట చూసిన వాస్తవాన్ని విపులంగా పరిశోధించిన పిదప ఇతర వాస్తవాలతో దానిని పోల్చి చూడటం వల్ల విలువైన శోదిత సత్యాలు తెలుసుకొని రాజనీతి శాస్త్రాన్ని అభివృద్ధి చేయడానికి వీలు కలుగుతుంది. తులనాత్మక పద్దతి వలన ఏ రాజ్యం ప్రజాసంక్షేమ విధులను చక్కగా నిర్వర్తిస్తున్నదో నిర్వర్తించడం లేదో, ఏదేశ రాజ్యాంగ విధానం బాగున్నదో, ఏదిబాగాలేదో ప్రభుత్వం విధానాలు, వాటి మంచి చెడులు మొదలగు అన్ని విషయాలు మనము గమనించగలుగుతాము.


తులనాత్మక రాజకీయ అధ్యయనంలో వివిధ రాజకీయ వ్యవస్థలు, సంస్థలు, వాటి విధానాలు ఎలా తయారు చేయబడినది మరియు వాటి విధులను గురించి తెలుసుకొనవచ్చును. తులనాత్మక పద్ధతిలో పై విషయాలు రెండు వర్గాలుగా విభజించి అధ్యయనం చేయబడతాయి. 1) సూక్ష్మస్థూల దశ, 2) నిలువు సమాంతర దశ. ఈ పద్ధతిని అరిస్టాటిల్, మాకియావెల్లి, మాంటిస్క్యూలు ఉపయోగించారు. తులనాత్మక పద్దతిని అరిస్టాటిల్, మాంటిస్క్యూ మరియు లార్డ్ బ్రెస్లు ఉపయోగించి, వివిధ దేశాల రాజ్యాంగములను అధ్యయనం చేసి ఒక నూతన రాజ్యాంగ వ్యవస్థను, ప్రభుత్వ వ్యవస్థను వారు రూపొందించారు.


తులనాత్మక పద్ధతిని రాజకీయ పార్టీలను అధ్యయనం చేయటంలో అస్ట్రోడ్స్క (Austrodrosky) మిచ్చెల్స్ (Michells) మొ||లగు రాజనీతి శాస్త్రజ్ఞులు తమ రచనల్లో ఉపయోగించారు. అదేవిధంగా ఆల్మండ్, కోల్మాన్ పావల్, లిప్సిట్ మొదలగు వారు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుచున్న రాజకీయ వ్యవస్థలను అధ్యయనం చేయుటలో ఈ దృక్పధమును అవలంభించిరి. లూసియన్పై (Lucian Pye), బర్మా దేశ రాజకీయ సంస్కృతిని విశ్లేషించి, దానిని అంతర్జాతీయ రాజకీయాలకు అన్వయించుటలో ఈ పద్దతినే ఉపయోగించినారు.


2.9.2 ప్రవర్తనావాద దృక్పథం


రెండవ ప్రపంచ యుద్ధానంతర పరిస్థితులలో రాజనీతి శాస్త్ర అధ్యయనాల్లో ప్రవర్తనావాద విప్లవం ఆవిర్భవించినది. అంతవరకూ అనుసరిస్తూ వస్తున్న సాంప్రదాయ అధ్యయన పద్ధతి రాజకీయ వాస్తవాలను వివరించటంలో విఫలమయింది. జాతుల మధ్య వైరాలు, అగ్రరాజ్యాల ఆవిర్భావం, జాతీయ వాదం వ్యాప్తి, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, జాతుల మధ్య అసమానతలు, ఆర్ధిక, సాంఘిక వ్యత్యాసాలు, తెగల మధ్య రగులుకొంటున్న విద్వేషాలు, పెరుగుతున్న ఉద్రిక్తతలు మొదలైనవన్నీ రాజనీతి, సామాజిక శాస్త్రవేత్తలకు సవాళ్ళుగా పరిగణించాయి. సామాజిక మార్పుకు వారు చేసిన సేవ సమాజ విజ్ఞాన శాస్త్రవేత్తలతో పోల్చినప్పుడు బహుతక్కువగా ఉంటుంది. అందువలన వారు అనేక విమర్శలకు గురయ్యారు. రాజనీతి శాస్త్ర అధ్యయనం వాస్తవ సమస్యల పరిష్కారానికి ఉన్న రుగ్మతలను విశ్లేషించి, అవి ఏర్పడటానికి కారకాలను శోధించి, వాటి నివారణకు ప్రత్యామ్నాయ నమూనాలను, విధానాలను చూపించాల్సిన బాధ్యతను రాజనీతి, సమాజ శాస్త్రజ్ఞులు తీవ్రమైన విషయంగా భావించలేదన్న విమర్శ సర్వత్రా వ్యక్తమయింది. సమాజ, భౌతిక శాస్త్రాలు బాగా అభివృద్ధి చెందగా, సామాజిక శాస్త్రాల అధ్యయనం మాత్రం చాలా వెనుకబడింది. అందువల్ల ప్రపంచంలో సంభవిస్తున్న మర్పులను అవగాహన చేసుకోవటంలోను, విశ్లేషించటంలోను సామాజిక శాస్త్రాల







Post a Comment

0 Comments