ప్రభుత్వపాలన స్వభావం
ప్రభుత్వ పాలన స్వభావం గురించి రెండు అభిప్రాయాలు ఉన్నాయి. అవి:
అవిచ్చిన్న దృక్పథము (Integral view) : ఈ దృక్పథాన్ని అనుసరించి ప్రభుత్వ విధానానికి అనుగుణంగా దాన్ని నిర్వహించడానికి మేనేజిరియల్, సాంకేతిక మరియు ఇతర కార్యకలాపాలు అన్నిటికి ప్రాధాన్యతనిచ్చి చేయు చర్యలను నిర్వహించుట. మరియు (also manual and clerical) కేవలము క్రింద నుండి పైవరకు ఉండే ఉద్యోగుల కార్యకలాపాలు వేరు వేరుగా ఉండవు. కాబట్టి పబ్లిక్ పరిపాలన యుద్ధరంగములో సమయములో కొంతవరకు తప్ప, సక్రమ పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చును.
దీనిని ప్రముఖ విద్వాంసులైన ఎల్.డి. వైట్ (L.D. White), యమ్.ఇ. డిమాక్ (M.E. Dimock), సిఫ్ఫ్నర్ (Siffner) మొదలగువారు సమర్ధించినారు. ప్రొఫెసర్ ఎల్.డి.వైట్ ఇచ్చిన నిర్వచనం ప్రకారం ప్రభుత్వ విధానానికి అనుగుణంగా దాన్ని నిర్వహించటానికి నిర్వహించు అన్ని కార్యకలాపాలకు (కార్యకలాపాలలో) ప్రభుత్వ పాలన. అనేక రంగాలలోను అనేక లక్ష్యాల కార్యకలాపాలకి అత్యంత ముఖ్యంగా, ప్రభుత్వ భూమి అమ్మటం, సంధి సంప్రదింపులు చేయడం, ప్రమాదాలు జరిగిన వారికి నష్టపరిహారాలు ఇవ్వడం, జబ్బుపడిన పిల్లను వేరుగా ఉంచడం, పన్నులు వసూలు చేయడం, లెటర్లు జారీచేయడం, ప్లూటోనియం తయారు చేయడం, ఎనర్జీని వినియోగించడానికి లైసెన్సు ఇవ్వడం - ఇవన్నీ నిర్వహణ పరమైన విషయాలు. (According to Prof. L.D. White Public administration “consists of all these operation having for their purpose the fulfilment or enforcement of public policy. This definition covers a multitude of particular operations in many fields the delivery of letter, the sale of public land, the negotiation of a treaty, the award of compensation to an injured workman, the quaran
tine of a sick child, the removal of litter from a park, manufacturing plutonium and licensing the use of atomic energy.” నిర్వహణ దృక్పథము (Managerial view) : ఈ దృక్పథాన్ని అనుసరించి ఏ సంస్థలోనైనా ఉన్నత పదవులలో ఉన్నవారు మరియు కొంతమంది కార్యనిర్వాహకులకు మాత్రమే ఉంటుంది. ఇతరుల కార్యకలాపాలకు మాత్రమే పరిపాలన పరిమితమౌతుంది. ఆరంభించిన నిర్వహణ నిపుణులు ఈ నిర్వచనాన్ని ప్రధానంగా రచించి, సమర్ధించిన వారు పి.యమ్. సైమన్ (Simon), స్మిత్‌బర్గ్ (Smithburg), థామ్సన్ (Thomson) ఈ పరిపాలనా దృక్పథాన్ని సమర్ధించినారు. లూథర్ గులిక్ ఈ విధంగా నిర్వచనం ఇచ్చారు. “నిర్వచించబడిన లక్ష్యాలను సాధించడానికి అమలు జరిగేటట్లు చూడటమే పాలన" అని లూథర్ గులిక్ వ్రాశాడు (Administration has to do with things done with the accomplishment of defined objectives-Luther Gullick)
ఈ రెండు దృక్పథాలు అనేక విధాలుగా పరస్పరం విభేదిస్తాయి. అవిచ్ఛిన్న దృక్పథం (Integral view) లో పరిపాలన అంటే అంతర్గతమైన కార్యకలాపాలు వేరుగా ఉండవు. నిర్వహణ దృక్పథంలో (Managerial view) వేరేగా ఉంటుంది. నిర్వహణ కార్యకలాపాలలో పరిపాలన పరిమితమై ఉంటుంది. అవిచ్ఛిన్న దృక్పథాన్ని అనుసరించి- కార్యకర్తలను నియమించడం, ఉద్యోగులకి జీతాలు చెల్లించడం, పర్యవేక్షణ, పంపిణీ, పన్నులు వసూలు చేయుట వంటి నిర్వహణ కార్యకలాపాలకు పరిపాలన తోడవుతుంది. నిర్వహణ దృక్పథం ప్రకారం ఒక వ్యవస్థలో నిర్వహణ కార్యకలాపాలు పరిపాలనకి దూరంగా ఉంటుంది. ఇంకా అవిచ్ఛిన్న దృక్పథాన్ని అనుసరించిన దానిని ఉదాహరణకి ఒక రంగం నుండి మరొక రంగానికి మారకుండా ఉంటుంది. నిర్వహణ దృక్పథం ప్రకారం ఇతర రంగాలకు పరిపాలన దగ్గరగా ఉండదు. నిర్వహణ దృక్పథాన్ని అనుసరించిన దానిని- నిర్వహణ, కార్యకలాపాలు ప్రభుత్వ పాలనలో ఒకే విధంగా ఉండవు. లూథర్ గులిక్ ఈ నిర్వహణ పద్ధతిని ఒక క్రింది ఆక్రమంగా సూచించాడు. ఇందులో పోస్డ్‌కార్బ్ (POSDCORB) అని గుర్తించినవి: ప్లానింగ్ (ప్రణాళికలు వేయడం), Organisation (వ్యవస్థీకరణ), Staffing (ఉద్యోగులకి నియమించడం), Directing (నిర్దేశించడం), Co-ordination (సమన్వయం), Reporting (వివరించడం), Budgeting (బడ్జెటింగ్). ఈ విధంగా దీనికి నిర్వచనం రాయవచ్చు. ప్రభుత్వ పాలన అంటే యుద్ధం యొక్క లక్ష్యం కోసం మనం దానిని ఉపయోగించి సందర్భాన్ని బట్టి ఉంటుంది.
(1) డిమాక్ డిమాక్, డిమాక్ మరియు కోయనింగ్ ఈ విధంగా చెప్పారు. 'As a study public ad- ministration examines every aspect of government's efforts to discharge the laws and to give effect to public policy, as a process it is all the steps taken between the time an enforcement agency assumes jurisdiction and the last break is placed (but in
cludes also that agency's participation in the first place), and as a vocation it is organising and directing the activities of others in a public agency-Dimock, Dimock and Koening. 1.4 ప్రభుత్వ పాలన పరిధి
స్థూలంగా చెప్పాలంటే, ప్రభుత్వ కార్యకలాపాలలో ప్రభుత్వ పాలన క్రిందికే వస్తుంది. కాని వారులఫ్, ప్రభుత్వ పాలన అంటే ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖకు అప్పగించబడిన సివిల్ విధులు, నియమవళి మరియు విధానానికి ప్రాధాన్యత సమకూర్చి, ఉద్యోగుల, అధికారుల పద్ధతుల అధ్యయనం (By established usage the term ‘Public Administration' has come to signify primarily the organization, per- sonnel, practices and procedures essential to the effective performance of the civilian functions entrusted to the executive branch of the government - John A. VieG).
కాబట్టి దీనికి ప్రభుత్వ మూడు శాఖల కార్యకలాపాలకి సంబంధం ఉండదు. ఇది కార్యనిర్వాహక శాఖలో ఒక భాగాన్ని మాత్రమే అధ్యయనం చేస్తుంది. అంటే విధానాన్ని అమలుచేసే శాఖ లేదా పరిపాలనా శాఖ మాత్రం అధ్యయనం చేస్తుంది. దీనికి, ప్రభుత్వ పాలన, కార్యనిర్వాహక శాఖలో కార్యనిర్వాహక చర్యను (Public Administration is in fact the executive in Action) ప్రాధాన్యతనిచ్చి అమలు చేయటంలో న్యాయం లేదా శాసన పాలన భాగం ఉన్నప్పటికీ ఇందు వాటి అధ్యయనం లేదు. మనం ఇపుడు వాస్తవ పరిపాలన లేదా రాజ్య వాస్తవ పాలనా యంత్రాంగాన్ని అధ్యయనం చేసాం. చాలామంది రచయితలు ప్రభుత్వ పాలనా శాస్త్ర పరిధిని తెలుపకుండా నిర్వచించారు. పి.యమ్.క్వీన్ అభిప్రాయం ప్రకారం ఈ శాస్త్రపరిధి మానవులు లేదా వస్తువుల, వనరుల అధ్యయనం (The scope of public Administration is the study of man, materals and methods - P.M. Queen). లూథర్ గులిక్ (Luther Gullick) అనే అమెరికన్ రచయిత ప్రభుత్వ పాలనాశాస్త్ర పరిధిని పోస్డ్‌కార్బ్ (POSDCORB) అనే మాటలో పొందుపర్చగా తెలిపారు. ఈ మాటలో ప్రతి అక్షరం ఒక నిర్వచనాన్ని వివరిస్తుంది.
“P” అనే అక్షరం **"Planning" (ప్రణాళికలు రచన)**ను సూచిస్తుంది. అంటే నిర్వహణలో కార్యకలాపాల విషయం నిర్ణయముచేసి వాటిని నిర్వహించడానికి ఉపయోగించబడిన పద్ధతులను నిర్ణయించుట.
“O” అనే అక్షరం **“Organisation" (వ్యవస్థీకరణ)**ను తెలుపుతుంది. చేయవలసిన పనికి అనుగుణంగా వ్యవస్థను ఏర్పరుచుట.
“S” అనే అక్షరం **“Staffing" (ఉద్యోగికి నియామకము)**ను ప్రతిబింబిస్తుంది. వ్యవస్థలో వివిధ ఉద్యోగాలకు సరైన వ్యక్తులను నియమించడం, ఉద్యోగి బృందమును అంతా ఇందు చేరుతుంది.
“D” అనే అక్షరం “Directing" (నిర్దేశించడం) అనే మాటను తెలుపుతుంది. నిర్ణయాలు చేయడం, ఉద్యోగులను నియమించడం, టేకుబందికి అన్వయాలు తీసుకుని మాటలు చెప్పుట అందులో చేరుతుంది.
“Co” అనే అక్షరం **“Co-ordination” (సమన్వయము)**ను ప్రతి దినం మార్పులు, పనిలో అట్లా పడటం, నిర్వహణలో ఇబ్బందులను తొలగించడం, ఇవి అన్నిటికీ సులభంగా పరిష్కారం.
“R” అనే అక్షరం **“Reporting" (వివరించడము)**ను సూచిస్తుంది. మీరు చేసినపనులని అధికారులకి, కింది ఉద్యోగులకి తెలియజేయుట, పర్యవేక్షణ, పరిశోధన, రికార్డులద్వారా అట్లాంటి సమాచార సేకరణకి ఏర్పాట్లు చేయుట.
“B” అనే అక్షరం “Budgeting” బడ్జెటింగ్ని ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో నిర్వహణకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఉంటాయి.