Type Here to Get Search Results !

పాలనా సాంఘిక మార్పు

0

 2.0 లక్ష్యాలు  


2.1 పరిచయం  


2.2 పాలనా సాంఘిక మార్పు, ఆర్థిక అభివృద్ధి సాధనం  


2.3 అభివృద్ధి చెందుతున్న సమాజాల్లో ప్రభుత్వపాలన విశేష లక్షణాలు  


2.4 అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న పాలనా సమస్యలు  


2.5 ఆధునిక రాజ్యంలో ప్రభుత్వపాలన పాత్ర  


2.6 ప్రభుత్వపాలన ప్రాధాన్యత పెరగడానికి కారణాలు  


2.7 ముగింపు  


2.8 వ్యాసరూప ప్రశ్నలు  


2.9 లఘు ప్రశ్నలు


ఈ యూనిట్‌ యొక్క ప్రధాన లక్ష్యాలు:


అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రభుత్వ పాలన యొక్క ప్రాముఖ్యతను వివరించడం.భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న సమాజాల్లో ప్రభుత్వ పాలన యొక్క లక్షణాలు, పాత్ర వివరించడం.అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న పాలనా సమస్యలు అర్థం చేసుకోవడం.ఆధునిక రాజ్యంలో ప్రభుత్వపాలన ఎందుకు, ఎలా ప్రధాన స్థానానికి ఎదిగిందో తెలుసుకోవడం.


ఆధునిక ప్రపంచ దేశాలను సాధారణంగా రెండు వర్గాలుగా విభజించడం జరుగుతోంది:


1. అభివృద్ధి చెందిన దేశాలు (Developed Countries):


పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికా, స్కాండినేవియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రష్యా, జపాన్, ఇజ్రాయిల్, దక్షిణ కొరియా మొదలైన దేశాలు.


2. అభివృద్ధి చెందుతున్న దేశాలు (Developing Countries):


ఆఫ్రికా, ఆసియా (జపాన్, దక్షిణ కొరియా మినహా), లాటిన్ అమెరికాలోని ఎక్కువ దేశాలు.రెండవ ప్రపంచ యుద్ధం తరువాత స్వాతంత్య్రం పొందిన ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని పేద దేశాలను —వెనుకబడిన దేశాలు, బడుగు దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, వర్ధమాన దేశాలు అనే పేర్లతో కూడా పిలుస్తారు.పేర్లు వేరైనా, మూల లక్షణం మాత్రం ఒకటే — ఆర్థిక వెనుకబాటు.ఈ దేశాల్లో సాంఘిక-రాజకీయ పరిస్థితులలో కొంత భేదం ఉండొచ్చు; కానీ ఆర్థికంగా వెనుకబడి ఉండటం వీటి సాధారణ గుణం.


దేశాలతో పోలిస్తే, వర్ధమాన దేశాలలోని ప్రజల జీవనస్థాయి చాలా తక్కువగా ఉన్నది.కాబట్టి ఈ దేశాలు ఆర్థిక రాజకీయ రంగాలలో మార్పులకోసం కృషి చేస్తున్నాయి. మార్పు సహజమే. అది అనివార్యంకూడా. అభివృద్ధి చెందిన దేశాలు మార్పును కోరుతున్నప్పటికీ, అవి సాధించిన ప్రగతిని నిలుపుకొనడానికే ఎక్కువ శ్రద్ధను కనబర్చడం జరుగుతోంది. ఏమైనా, మార్పుకన్నా యథాతధ స్థితిని (వ్యవస్థను నిలపడమే అక్కడ ప్రధాన సమస్య.


వర్థమాన దేశాలలో మార్పులు విస్త్రతంగా, త్వరితగతిని జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ దేశాల పాలనా వ్యవస్థలుకూడా మారే పరిస్థితులకు అనుగుణంగా మారవలసి ఉంటుంది. అంటే, పాలనా పద్దతులు,' పాలకుల ఆలోచనల, దృక్పధాల, విలవలలో తదనుగుణంగా మార్పులు రావలె. ఆర్థిక అసమానతలను తగ్గించడమే


అభివృద్ధి చెందిన దేశాల ప్రధాన సమస్య. వర్థమాన దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు సంపదను వృద్ధిచేయడం,అసమానతలను నిర్మూలించడం. ఈ రెండు సమస్యల వలన పాలనా వ్యవస్థభారం అధికమవుతోంది. ఈ రెండు లక్ష్యాలలో ఒకదానికి ప్రాధాన్యతనిస్తే, రెండవది దెబ్బతినగలదు. కాబట్టి అభివృద్ధితో సాంఘిక న్యాయం (growth with social justice) అనేది ఈ దేశాల ముందున్న సమస్య.


2.2 పాలనా సాంఘిక మార్పు, ఆర్ధికాభివృద్ధి సాధనం


ప్రభుత్వ పాలన సాంఘిక మార్పు, ఆర్థికాభివృద్ధి సాధనంగా ఉపకరిస్తుంది. మార్పును తెచ్చే సాధనంగా ప్రభుత్వ పాలన పాత్ర ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న సమాజాల (తృతీయ ప్రపంచం) లో అత్యంత కీలకమైనది. పైన చెప్పినట్లుగా రెండవ ప్రపంచ యుద్ధానంతరం "తృతీయ ప్రపంచపు" అభివృద్ధి చెందుతున్న దేశాల రాజకీయ స్వాతంత్య్రం పొందినాయి. ఏమైనా, ఇవి శతాబ్దాల తరబడి వలస పాలనకు గురియైన ఫలితంగా ఆర్థికంగా పేద దేశాలుగానే ఉండినాయి. ఇవి జాతి నిర్మాణ కార్యకలాప సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. పేదరికం, నిరుద్యోగ సమస్య, సంపదలో


విపరీత వ్యత్యాసాలు, పారిశ్రామికీకరణ, ఆధునికీకరణ మొదలగునవి ఇది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. కాబట్టి వీటి తక్షణ కర్తవ్యం ఆర్థికాభివృద్ధిని, జాతీయ సంపదను సమానంగా పంపిణీ చేయడం. ఆర్థికాభివృద్ధిని, సాంఘిక సంక్షేమ లక్ష్యాలను సాధించడానికి ఇవి ఆర్థిక ప్రణాళికాభివృద్ధిని చేపట్టినాయి. ఈ కార్యాకలాపాలన్నీ ప్రభుత్వపాలనకు సవాళ్ళుగా పరిణమించినాయి. కాబట్టి అభివృద్ధి చెందుతున్న సమాజాలలో సమస్యలను గుర్తించి, వాటికి నివారణోపాయాలను సూచిండంలో ప్రభుత్వ పాలన నిర్మాణాత్మక, చురుకైన పాత్ర వహించవలసి ఉంటుంది. ఈ దేశాలలో ఆర్థికాభివృద్ధి సనాలు ఎదుర్కొనేందుకు, సాంఘిక మార్పును నిర్దేశించేందుకు ఉద్యోగిస్వామ్యం పటిష్టవంతమైనదై నీతివంతమైనదై ఉండవలె.దీనికి కార్యోన్ముఖత, లక్ష్యోన్ముఖత ఉండవలె. అపుడే అది వ్యవసాయక సమాజాలను ఆధునిక పారిశ్రామిక


సమాజాలుగా మార్చగల వాంఛిత ఫలితాలను సాధించగలుగుతుంది. ప్రభుత్వ పాలనా వ్యవస్థ బలహీనమైనదై,ప్రతిస్పందనలేనిదైతే, లక్ష్యాలను సాధించక పోవడమే గాక రాజకీయ వ్యవస్థనే బలహీనపరుస్తుంది. కాబట్టి ఈ చర్చదృష్ట్యా అభివృద్ధి చెందుతున్న సమాజాలలో ఉద్యోగిస్వామ్యం ఎటువంటి ముఖ్యమైన పాత్ర వహించేది స్పష్ట మవుతుంది.అభివృద్ధి చెందుతున్న సమాజాల్లో పాలనా ప్రాముఖ్యత ప్రధాన అంశాలు ఈ క్రింద వివరించబడినాయి:


1. అభివృద్ధి చెందుతున్న దేశంలో దారిద్య్ర, నిరక్షరాస్యత, రోగ బాధలను నివారించడానికి బహుముఖ ప్రయత్నాలు

జరుగుతున్నాయి. శీఘ్రాభివృద్ధి సాధనకు అవలంబిచదగు వ్యూహం ప్రణాళికా రచనే. ప్రణాళికలను

రూపొందించడంలో, నిర్ణీతకాలంలో పథకాలను, ప్రాజెక్టులను పూర్తిచేయడంలో పాలనా వ్యవస్థ ముఖ్య

వహిస్తుంది. త్వరితగతిని అభివృద్ధి సాధించడానికి పాలన, ముందుచూపు కలదిగా, ఫలితోన్ముఖమైందిగా


(Result-oriented) వ్యవహరించవలసి ఉంటుంది. పాలనబడుగువర్గాల సంక్షేమాభివృద్ధి విషయంలో

అధికశ్రద్దను కనపర్చవలె.

పాలనా వ్యవస్థ వివిధ కార్యక్రమాలను నిర్వహించడానికి సులభం చేయవలె. అది ప్రజలలో ప్రేరణ కలిగించి,

ప్రజలలో చైతన్యం కలిగించడం ద్వారా అవసరమైన మార్పులు తీసుకురావచ్చు.

ప్రభుత్వోద్యోగులు జనసామాన్యంతోను ఏకమై (కలిసి మెలిసి పోయి వారిని అర్థం చేసుకొని వారి ప్రశ్నలకు

ఓపిగ్గా సమాధానాలివ్వవలె..

అభివృద్ధి చెందుతున్న సమాజంలో ప్రభుత్వపాలన సంబంధంగా కార్యసాఫల్యమూ, సమూహనిర్వర్తన (Group performance) సమన్వయములకు తగు ప్రాధాన్యత ఉంది.


ఆధునిక రాజ్యవ్యవస్థలో భిన్న ప్రాంతాలు, మతాలు, కులాలు, వర్గాల వారు ఉండటం సామాన్య విషయమే.

కాబట్టి పాలనా వ్యవస్థ జాతీయ సమైక్యాన్ని పెంపొందింప ప్రయత్నిస్తుంది. మనదేశం, ఆఫ్రికా ఖండంలో

పలు దేశాలలో దీని ఆవశ్యకత చాలవరకు గలదు.

ప్రభుత్వోద్యోగుల సామార్థ్యమునుబట్టి ప్రజల సంక్షేమం ఆధారపడి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని

ఆదేశ సూత్రాలనుగాని ప్రభుత్వ ఇతర విధానాలనుగాని పాలనోద్యోగులే నెరనేర్చవలసి ఉంటుంది.


2.3


అభివృద్ధి చెందుతున్న సమాజాల్లో ప్రభుత్వ పాలన విశేష లక్షణాలు

వర్థమాన సమాజాల్లో ప్రభుత్వాలు అనేక విధుల నిర్వహించవలసివస్తున్నది. వర్ధమాన దేశాల పాలనా వ్యవస్థ

చట్రాలు, పద్దతులు ఇంతకుపూర్వం ఆయా దేశాలను పాలించిన వలసరాజ్యాం యాజమాన్యాల నుంచి 'వారసత్వం'గా

సంక్రమించినాయి. ఇవి నాటి వలస పాలకుల ఆర్థిక, రాజకీయ లక్ష్యాల సాధనకోసం నిర్మింపబడినవే.

ఇవి సంక్షేమ, అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించడానికి అనుగుణంగా లేవని

అనుభవపూర్వకంగా రుజువైంది.

వాస్తవానికి ఒకవేళ అభివృద్ధి స్థాయిని నిర్ణయించడంలో ఆ దేశ పాలనా వ్వవస్థ పటిష్టత ఒక సూచికగా

ఉపకరిస్తుంది. వర్ధమాన దేశాలలో ఆశయాలో ఆచరణల మధ్య పెద్ద అగాధమేర్పడింది. ఇది పాలనా వైఫల్యతను

సూచిస్తుంది. ఈ వైఫల్యతకు దారితీస్తున్న అంశాలను గుర్తించ గలిగిన, పాలనాసామర్థ్యాన్ని పెంచనవకాశం ఉంటుంది. పాలనా పరమైన అంశాలు ఎప్పుడు తలకోరివిగా మారతూ ఒక పట్టాన అర్థం చేసుకోవడానికి అడ్డంకిగా ఇబ్బందిగా తలపిస్తాయి ఈ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితీ దీనిని సహేతతుకంగా ఎదుర్కొనాల్సిన భాద్యత అటు ప్రభుత్వాల పైన ఇటు ప్రజలపైన ఇద్దరి పైనా ఉంది. వర్థమాన రాజకీయనాయకులు నమ్మశక్యంగా లేకపోవడం గమనార్హం






Post a Comment

0 Comments