Type Here to Get Search Results !

ప్రముఖుల సమాజిక శాస్త్ర విశ్లేషణ

0

 A frame work for political Analaysis అనే గ్రంథంలో రాజకీయ ప్రక్రియలను, శక్తులను విశ్లేషించటానికి రాజకీయ వ్యవస్థ అధ్యయనకు సరియైనదని డేవిడ్ ఈస్టన్ భావించారు. సామాజిక ప్రవర్తనల పరస్పర చర్యల అమూర్త రూపమే రాజకీయ వ్యవస్థ అని ఈస్టన్ భావన. రాజకీయ వ్యవస్థ ద్వారా సమాజంలో వివిధ విలువలు అధికారికంగా కేటాయించడం జరుగుతుందని ఈస్టన్ భావన, వివిధ సామాజిక వ్యవస్థల్లో రాజకీయ వ్యవస్థను ఒక దానినిగా ఈస్టన్ గుర్తించారు. సమాజంలోని విలువలను అధికారికంగా రూపొందించి, కేటాయించి అమలుపరచే విభాగమే రాజకీయ వ్యవస్థ అని ఈస్టన్ సిద్ధాంతీకరించారు.


రాజకీయ వ్యవస్థను విశ్లేషించిన డేవిడ్ ఈస్టన్ సిద్ధాంతంలో ఈ క్రింది ప్రధానాంశాలు ఉన్నాయి:


1. సామాజిక ప్రవర్తనల, పరస్పర చర్యల అమూర్త రూపమే రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థ ద్వారానే సమాజంలో విలువల సాధికారిక కేటాయింపు జరుగుతుంది.


2. అధికారులు వివిధ నిర్ణయాలే విలువలు సాధికారిక కేటాయింపులు. ప్రతి సమాజంలో సభ్యులకు ఉపయోగపడే వస్తువులు, సేవలు పరిమితంగా ఉంటాయి. వాటికొరకై సభ్యుల మధ్య తప్పనిసరి అవుతుంది. ఈ సందర్భంలోనే సమాజం అధికారికంగా సభ్యుల మధ్య వస్తువులను సేవలను కేటాయిస్తుంది.


3. సమాజంలో అత్యధిక సభ్యుల ఆమోదం పొందిన కేటాయింపులే సాధికారికమైనవి. అలాగే ఇతరులకు లేని వాటిని నూతన కేటాయింపుల ద్వారా అందించవచ్చు.


4. రాజకీయ స్వభావం గల అధికారిక కేటాయింపులను ఇతర విధానాలకు సంబంధించిన కేటాయింపుల నుంచి వేరు పరచవలసి ఉంటుంది.


5. సమాజంలో విలువలను సాధికారికంగా కేటాయిపులు చేయగల నిర్మితులు (Structure) పాత్రల సమాహారమే రాజకీయ వ్వవస్థ.


సామాజిక వ్యవస్థల్లో ఒకదానినిగా రాజకీయ వ్యవస్థగా భావించినప్పుడు దానిని నిర్దుష్ట పరిధులలోనే అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ నిర్దుష్టమైన పరిధియే రాజకీయ వ్యవస్థను ఇతర వ్యవస్థల నుండి వేరు పరుస్తుంది. ఈస్టన్ అభిప్రాయంలో రాజకీయ వ్యవస్థ రెండు రకాల భౌతిక, సామాజిక పరిసరాలను సమాజ అంతర్గత (Intra -Societal) సమాజానికి వెలుపల (Extra Societal) గా డేవిడ్ ఈస్టన్ సిద్ధాంతీకరించారు. సమాజంలోని భౌతిక వాతావరణం, ఇతర వ్యవస్థల చర్యలు, ప్రతి చర్యలను సమాజ అంతర్గత పరిసరాలుగా పేర్కొన్నారు. ఆయన వాటిని ఈ క్రింది విధంగా వివరించారు.


I) ఆవరణ సంబంధిత పరిసరాలు


మానవుల ఉనికితో పాటు ఉండే అనేక మానవేతర అంశాలు ఇందులో ఉన్నాయి. ఉదా॥ వాతావరణం, విస్తీర్ణం, నదీజలాలు, భూవనరులు, పర్వతాలు, లోయలు, అటవీ వనరులు మొ॥ వన్నీ భౌగోళిక స్వభావం గల భౌతిక పరిసరాలు.


II) జీవ సంబంధిత పరిసరాలు


వంశపారంపర్యత, జన్యు సంబందిత, జీవపరమైన పరిసరాలు ఇందులో ఉంటాయి. ఉదా॥ వ్యక్తుల్లోని సహకార ఇచ్చ. హేయబద్ధ ఆలోచలను, రాజకీయ వ్యవస్థల మనుగడకు దోహదం చేస్తాయి.


III) మూర్తిత్వం


రాజకీయ వ్యవస్థలోని వ్యక్తుల మూర్తిత్వాలు, వ్యవస్థ స్వరూపం, నిర్ణయాలు, నిర్వహణల్లో ప్రభావాన్ని చూపుతాయి.


IV) సామాజిక వ్యవస్థ


సామాజిక వ్యవస్థలోని ఇతర వ్యవస్థలన్నీ - సాంస్కృతిక, సాంఘిక, ఆర్ధిక, రాజకీయ వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి.

సమాజం వెలుపల ఉన్న పరిసరాలు కూడా రాజకీయ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. ఉదా॥ అంతర్జాతీయ సంస్థలు, ఇతర దేశాలు, వాటితో గల సంబంధాలు రాజకీయ వ్యవస్థ వెలుపల గల పరిసరాలు. పరిసరాలు రాజకీయ వ్యవస్థను డేవిడ్ ఈస్టన్ బహిరంగ వ్యవస్థగా అభివర్ణించారు. రాజకీయ వ్యవస్థ ఎల్లప్పుడూ తన అంతర్గత, బహిర్గత ప్రభావాలకు లోనవుతుంటుంది. అంతరంగికంగా ఆందోళనలు, ఉద్యమాలు రాజకీయ వ్యవస్థలపై ఒత్తిడులు కలుగజేస్తుంటాయి. విదేశ దండయాత్రలు, విదేశీయులు పరిపాలనలో జోక్యం బహిర్గతంగా ఒత్తిడులను కలుగజేస్తాయి. ఒక వ్యవస్థ కొనసాగింపు అందులోని ఒత్తిడుల సమతౌల్యంపై ఆధారపడి ఉంటుంది. అధిక కేటాయింపుల కోసం ప్రతి సమాజం ప్రయత్నిస్తుంటుంది. ఈ ప్రయత్నాలు అధికారం కైవసం కొరకు పోరాటంగా పరిణమిస్తాయి. ఇటువంటి పోరాటాల్లో రాజకీయ వ్యవస్థ క్రియాత్మకంగా జోక్యం చేసుకోవలసి ఉంటుంది.


ప్రతి రాజకీయ వ్యవస్థ అనేక మార్పు చేర్పులకు గురౌతుంటుంది. అయితే మార్పుల స్థాయి ఒక రాజకీయ వ్యవస్థ. క్షీణత లేక అభివృద్ధిని సూచిస్తాయి. అధికారిక విలువల కేటాయింపుల స్థాయిలోనే ఒక రాజకీయ వ్యవస్థ అనేకమైన ఒత్తిడులకు గురౌతుంటుంది. అధికార విలువల కేటాయింపులలో మార్పులు లేకపోతే ఆ వ్యవస్థ స్థిరంగా తన మనుగడను కొనసాగించటం సాధ్యమవుతుంది. ఒత్తిడులు రాకుండా నివారించగల్గితే లేదా వత్తిడులను విజయవంతంగా వ్యవస్థలు అంతర్భాగము చేసుకొని తగు తూర్పు చేర్పులలో కొనసాగితే అప్పుడు కూడా వ్యవస్థ విజయవంతమయినట్లుగా భావించాల్సి ఉంటుంది. రాజకీయ విశ్లేషణలలో డేవిడ్ ఈస్టన్ వ్యవస్థల సిద్ధాంతం చాలా ప్రాముఖ్యం పొందింది.


ఈ సిద్ధాంతము కొంత విమర్శకు కూడా గురియైనది. ఈ సిద్ధాంతములో చెప్పినట్లుగా ఒక వ్యవస్థ హద్దులను నిర్ణయించటం వాస్తవంలో చాలా క్లిష్టమైన పని. ఉత్పాదకాలు (Inputs) ఉత్పాదితాలు (Outputs) గా ఎలా మారుతాయన్న అంశాన్ని గురించి ఈస్టన్ ఏమి వివరించలేదు. ఆయన కేవలం రాజకీయ వ్యవస్థ మనుగడకే ప్రాధాన్యమిచ్చాడు. అలాగే, రాజకీయ శక్తిని ఎవ్వరు, ఎక్కడ, ఎలా, ఎందుకు ఉపయోగిస్తారన్నది కూడా ఈస్టన్ ప్రస్తావించలేదు. స్వేచ్ఛా, అధికారం, రాజ్యాంగవాదం మొదలైన విలువలను ఈస్టన్ వివరించలేదు. అంతే కాకుండా మెజారిటీ ప్రజలు ప్రయోజనాల పరిరక్షణలో రాజ్యాధికారాన్ని ఎలా నియంత్రించవచ్చు అన్న అంశానికి కూడా డేవిడ్ ఈస్టన్ ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వలేదు.


నిర్మితులు - విధుత విశ్లేషణ


నిర్మితులు - విధుల విశ్లేషణ దృక్పథం వ్యవస్థల సిద్ధాంతానికి చాలా సన్నిహితంగా ఉంటుంది. నిర్మితులు - విధుల సిద్ధాంతం కూడా ప్రవర్తనావాద ఉద్యమ ఫలితమే. ఈ దృక్పథం సామాజిక యదార్థాలైన నిర్మితులు (Structure) విధులు (Functions) (ప్రక్రియలు (Processes) యంత్రాంగాలు మొదలైన వాటిని వివరించటానికి ప్రయత్నిస్తుంది. టాల్కాట్పెర్సన్, ఇసెనెట్ (Eisenstand), డేవిడ్ ఆప్టర్ (David After) ఆల్మండ్ మొదలగువారు ఈ దృక్పథాన్ని ప్రతిపాదించారు. డేవిడ్ ఈస్టన్ నమూనా వలె ఆల్మండ్ విశ్లేషణ కూడా వ్యవస్థా భావనపైననే ఆధారపడి ఉ oది."తులనాత్మక రాజకీయాలు" (Comparative Politics) అనే గ్రంథంలో ఆల్మండ్ తన సిద్ధాంతాన్ని చర్చించారు. విధుల నిర్వహణ రీతులను అనుసరించి రాజకీయ వ్యవస్తలను శ్రేణీకరించాలన్నది ఆల్మండ్ భావన. ప్రతి రాజకీయ వ్యవస్థ రెండు రాకాలైన విధులను తప్పనిసరిగా నిర్వహిస్తుంటుంది. అవి : 1. ఉత్పాదక (Inputs) లేదా రాజకీయ (Political) విధులు, ఉత్పాదిత (Outputs) లేదా ప్రభుత్వ విధులు. ఆల్మండ్ ఐదు ఉత్పాదక: మూడు ఉత్పాదిత విధులను పేర్కొన్నారు.


 ఉత్పాదక విధులు


১) (Political Socialisation)


బి) రాజకీయ నియామకాల భర్తీ (Political Recruitment)


3) (১ : (Interest Articulation)


డి) ప్రయోజనాల సమీకరణం (Interest Aggregation)


3) (১৯ (Political Communication)







Post a Comment

0 Comments