Type Here to Get Search Results !

ప్రవర్తనావాదం విస్తరణ

0

 అధ్యయనం సార్ధకత ప్రశ్నార్ధకంగా మిగిలిపోయాయి. ఈ కారణం వల్లనే సామాజిక శాస్త్రాల అధ్యయనంలో, మారుతున్న ప్రపంచపు వాస్తవాలను అనుగుణంగా మార్పులు తేవలసిన అవసరాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పర్యవసానంలో ప్రవర్తనావాద విప్లవం (Behavioural Revolution) అవతరించింది.

 ప్రవర్తనా వాద విప్లవం

ప్రవర్తనావాద విప్లవం వ్యక్తుల ప్రవర్తనను, దానికి గల ప్రోద్భలాలను, సంస్థల యంత్రాంగాన్ని అధ్యయనం చేయ ప్రయత్నించింది. వ్యక్తికీ, సమాజానికి ఉన్న సంబంధము ప్రధానంగా సామాజిక ప్రవర్తన అంశాలను వివరించటానికి ప్రయత్నం చేస్తుంది. ప్రవర్తనావాదం నిర్మితుల అధ్యయనం నుంచి కొన్ని రాజకీయ పరిస్థితుల్లో వ్యక్తులు ఏ విధంగా వ్యవహరిస్తారు., వారి చర్య ప్రతిచర్యలు ఏ విధంగా ఉంటాయన్న అంశాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. సంస్థలను కేవలం నిర్మాణ పరంగా అధ్యయనం చేయకుండా, వాటిని వ్యక్తులు వ్యక్తుల సమూహాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయో విశ్లేషించ ప్రయత్నిస్తుంది. సంస్థలు వ్యక్తుల ప్రమేయం లేకుండా, వారి ఆసక్తులను పరిగణనలోనికి తీసుకొనకుండా పని చేయలేనని ప్రవర్తనావాదం విశ్వసిస్తుంది. రాజకీయ రంగంలో వ్యక్తులు వారివారి ఆసక్తులు, దృక్పధాలు, అవగాహనలను అనుసరించి ఎలా వ్యవహరిస్తారు, వారి చర్య ప్రతిచర్యల ప్రభావం వ్యవస్థపై ఏ విధంగా ఉ ంటుందో వివరించటానికి, విశ్లేషించటానికి ప్రయత్నిస్తుంది. వ్యక్తుల ప్రవర్తనను, అధ్యయనం చేసి వారు విడిగాను, సమిష్టిగాను, సంస్థలను ఏ విధంగా ప్రభావితం చేస్తారో ప్రవర్తనావాదులు అధ్యయనం చేస్తారు. వ్యక్తుల పరంగా, వారి ప్రవర్తనల పరంగా అధ్యయనం చేసే ఈ దృక్పథాన్ని ప్రర్తనావాద దృక్పధం అని అంటున్నారు.

రాజకీయాలను శాస్త్రీయ దృక్పథంలో అధ్యయనం చేయటానికి ప్రవర్తనావాదం నూతన పరికరాలను అందచేసింది. ఈ దృక్పథంలో విభిన్న ఆసక్తులు, కార్యకలాపాల్లో నిమగ్నుడయ్యే వ్యక్తి కేంద్ర బిందువు అవటం వల్ల సామాజిక, సాంస్కృతికాంశాలకు ప్రవర్తనావారం ప్రాధాన్యమిస్తుంది. మనోవైజ్ఞానిక శాస్త్ర పద్దతులను ప్రవర్తనావాదం అనుకరించింది. సాంపిల్ సర్వేలు, నిర్మిత షెడ్యూల్స్, ప్రశ్నోత్తరావళి, సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి, శ్రేణీకరించి, విశ్లేషించటం మొదలైన పద్ధతులు ప్రవర్తనావాద అధ్యయనం దృక్పథంలో ప్రధానాంశాలు. ఈ విధంగా సేకరించిన సమాచారం ఆధారంగా ప్రవర్తనావాదం అనుభవ పూర్వక (Empirical) సిద్ధాంతాలను రూపొందించ ప్రయత్నిస్తుంది.

ప్రవర్తవావాద ప్రేరకాలు

ప్రవర్తనావాదం శాస్త్రీయ సిద్ధాంత పరిశోధనలను, ప్రాతిపదికలుగా కలిగి ఉంది. రాజనీతి శాస్త్రంలో ఇది ఒక నిరసనోద్యమం. ఈ వాదం రాజకీయ వాస్తవాలను విశ్లేషించటంలోను, వివరించటంలోను ఒక పద్దతి. చార్లెస్ మారియన్ను (Charless Marrian) మొదటి ప్రేరకంగా పేర్కొనవచ్చు. హెరాల్ట్ లాస్వేల్ (Harold Laswell) డేవిడ్ ట్రూమన్ (David Truman) 5 (Saimon), খ (Almanod) 2 5 (Robert A Dahl) 2 ລ້ రూపకల్పనకు బాధ్యులు. రాబర్టు ఎ డాల్ అభిప్రాయం ప్రకారం ప్రవర్తనావాదం ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో గమనింపబడిన, గమనింపదగిన మానవ ప్రవర్తన అని తెలుస్తుంది. ప్రవర్తనావాదం మానవ ప్రవర్తనను ప్రకృతి విజ్ఞాన శాస్త్రాల పద్దతిలో అవగాహన చేసుకోవటానికి, వివరించటానికి ప్రయత్నిస్తుంది.

ప్రవర్తనావాదం లక్షణాలు..?

డేవిడ్ ఈస్టన్ రచించిన " ప్రవర్తనావాదం ప్రస్తుత అర్ధాన్ని గూర్చిన వ్యాసం" (Eassay on the current meaning of Behaviour) అనే గ్రంధంలో ప్రవర్తనా విప్లవానికి సంబంధించిన కొన్ని ముఖ్య సూత్రాలను సూచించాడు. ఆయన ఈ సూత్రాలను ప్రవర్తనావాద ఉద్యమ నిర్మాణానికి కారణభూతమైన మేదస్సంబంధమైన ప్రాతిపదికలుగా భావించారు.

అవి : 1. నియమ బద్ధతలు, 2. పరిశీలనలు, 3. పద్ధతులు, 4. పరిమాణాత్మకత, 5. విలువలు, 6. క్రమబద్ధీకరణ, 7.పరిపూర్ణ విజ్ఞాన శాస్త్రము, 8. సమగ్రత అనేవి మేధస్సంబంధమైన ప్రాతిపదికలు.

1. వియమ బద్ధతలు :

రాజకీయ ప్రవర్తనలో కొన్ని సమానతలున్నాయని ప్రవర్తనావాదులు భావిస్తారు. ఈ సమానతలను సాధారణీకరించ వచ్చును లేక రాజకీయ సంఘటనలను సూచించేందుకు గాని, వివరించేందుకు గాని ఉద్దేశింపబడిన సిద్ధాంతాల రూపంలోను వ్యక్తం చేయవచ్చునని వారు భావిస్తారు. ఓటింగ్ ప్రవర్తన దీనికి చాలా చక్కని ఉదాహరణ. భారతదేశంలోని ఓటర్ల ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. అమెరికా, బ్రిటన్ దేశాలలోని ఓటర్ల ప్రవర్తన మరొక విధంగా ఉంటుంది. వీటిని తులనాత్మకం చేయాలి.


2. పరిశీలవలు


ప్రవర్తనావాదుల దృష్టిలో విజ్ఞానం పరిపూర్ణంగా ఉండాలంటే ప్రయోగాత్మకంగా పరీక్షించబడిన ప్రతిపాదనలు మాత్రమే కలిగి ఉండాలి. దీనికి సంబంధించిన విషయం అంతా పరశీలనాధారంగా ఉండాలి. పరిశాలనన్నింటిని సక్రమమైనవా? కావా ? అని నిగ్గు తేల్చటంలో పరిక్షించటం, పునః పరీక్షించటం జరగాలి.


3. పద్ధతులు


ప్రవర్తనావాదులు విషయాలను సేకరించుటంలోను, వివరించుటలోను సరియైన పద్ధతులను అవలంభించవలసిన అవసరాన్ని గూర్చి తెలియజేసారు. ఇందుకు వీరు విభిన్న విశ్లేషణ, గణిత శాస్త్ర నమూనాలు లాంటి ఆధునిక పద్దతులను ఉపయోగించాలని సూచనలు చేసారు.


4. పరిమాణాత్మకత


ప్రవర్తనావాదులు పరిమాణాత్మకతను అంచనా వేయటానికి కూడా ప్రాధాన్యతనిస్తారు. సాంఘిక విజ్ఞాన శాస్త్రంలో ఖచ్చితంకాని, గుణాత్మక నిర్ణయాలకు తావు లేదని వారు దృఢంగా విశ్వసిస్తారు.


5. విలువలు


విషయాన్ని నిష్పాక్షికంగా పరిశీలించి, విశ్లేషించి, సిద్ధాంతీకరించటానికి సామాజిక శాస్త్రజ్ఞులు వారి వారి వ్యక్తిగత విలువలను దూరంగా ఉంచి పరిశోధనకు ఉపక్రమించాల్సి ఉంటుంది.


6. క్రమబద్దీకరణ


రాజనీతి శాస్త్రంలో పరిశోధనా సిద్ధాంతము నిర్దేశికంగా గాని, లేక విశద పూర్వకంగా గాని ఉండాలని ప్రవర్తనావాదులు చెప్తారు. సిద్ధాంతము, పరిశోధన, పొందికగాను, క్రమబద్దమైన విజ్ఞానంతో సన్నిహిత సంబందాలు కలిగిన భాగాలుగా ఉండాలని దీని భావం. పరిశోధనా, సిద్ధాంతాన్ని విశదపరచేలాగా ఉండాలి. సిద్ధాంతం విషయాధారంగా ఉండాలి. సిద్ధాంతానికి, ఆచరణకు సన్నిహిత సంబంధం ఉండాలని క్రమబద్దీకరణ భావం.


7. పరిపూర్ణ విజ్ఞాన శాస్త్రం


రాజనీతి శాస్త్రం పూర్తిగా విజ్ఞాన శాస్త్రంగా ఉండాలని ప్రవర్తనావాదులు పేర్కొంటారు. ప్రాధమిక పరిశోధనా నిర్వహణలో ఆ విజ్ఞానమే అత్యవసర సాంఘిక సమస్యల పరిష్కారానికి ఉపయోగింపబడాలి. ఈ విజ్ఞానం ఆచరణలో అనువర్తింప జేయటానికి ముందు అవగాహన వివరణ ఏర్పడాలి.


8. సమగ్రత


సమగ్రత, సాంఘిక విజ్ఞాన శాస్త్రాలన్నీ అంతర్గత సంబంధాలు కలిగి ఉన్నటువంటిని విశ్వసిస్తుంది. ఈ సమగ్రత రాజనీతి శాస్త్రాన్ని, శాస్త్రాలన్నింటిలోను ఒక భాగంగా రూపొందించాలని సూచిస్తుంది. సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, మత, మానసిక, చారిత్రక అంశాలన్నింటితో జోడిస్తేనే ' రాజకీయ వ్యక్తి ' (Political man) అర్ధం అవుతాడు. ఇటువంటి దృక్పధం వలన రాజకీయ అధ్యయనం శ్రేష్టమైన విజ్ఞాన శాస్త్రంగా గాని, లేక నిర్మాణాత్మకత విజ్ఞాన శాస్త్రంగా గాని రూపొందుతుంది.


ప్రవర్తనావాదం 1960 దశకంలో తీవ్ర విమర్శకు గురైంది. ప్రవర్తనావాదుల, యధా తధ స్థితిని (Statusquo) సమర్ధించుకొనే పరిస్థితులను సృష్టించారు. అందువల్ల ఉత్తర ప్రవర్తనావాద ఉద్యమం అన్న పేరుతో (Post Behavioural Movement) మరొక దృక్పథం అవతరించింది. ఇది సామాజిక శాస్త్ర పరిశోధనల్లో విషయ ప్రాముఖ్యానికి, వివరణకు, సార్ధకతకు ప్రాముఖ్యం ఇచ్చింది. ఉత్తర ప్రవర్తనావాదులు ప్రస్తుత సమస్యలైన నిరుద్యోగం, పేదరికం, ఘర్షణలు, ఉద్రిక్తతలు, అసమానతలు మొదలగు సమస్యలకు రాజనీతి శాస్త్రజ్ఞులు సమాధానం, పరిష్కార మార్గాలు చెప్పాలంటారు రాజనీతి శాస్త్రవేత్త కర్తవ్యం పూర్తి కాదని; దానికి తగిన పరిష్కారమార్గం కూడా సూచించాల్సిన బాధ్యత ఉండదని సర్వత్రా భావిస్తున్నారు. ఈ ఆలోచనే పాశ్చాత్య దేశాల్లో ఉత్తర ప్రవర్తనావాదా ఉద్యమానికి నాంది పలికింది.


2.9.2.4 ప్రవర్తనావాద సిద్ధాంతం విమర్శ


1. ప్రక్రియలకు, పద్దతులకు అధిక ప్రాధాన్యం యిచ్చి, విషయాన్ని విస్మగిస్తుందని వాస్బీ (Wasby) ప్రవర్తనావాదాన్ని విమర్శించాడు.


2. ప్రవర్తనావాదాన్ని బే (Bay) కపట రాజకీయాలని నామకరణ చేసాడు. కపట రాజకీయాలు రాజకీయ కార్యకలాపాలను పోలి ఉన్నా అవి కేవలం వ్యక్తిగత ప్రయోజనాలను పెంపొందించటం పట్ల ఆసక్తి కలిగి ఉంటాయి. రాజకీయాలు సార్వత్రిక ప్రయోజనాలను పెంపొందించే లక్ష్యాన్ని కలిగి ఉండాలి. రాజకీయ సార్వత్రిక ప్రయోజనాలను పెంపొందించే లక్ష్యాన్ని కలిగి ఉండాలి.


3. ప్రవర్తనావాదులు సంస్థలకు సంబంధించిన అధ్యయనాలకు ప్రాధాన్యం తగ్గించి ప్రవర్తనకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది.


4. అతి సామాన్యమైన అర్ధరహిత అంశాలకు ప్రవర్తనావాద దృక్పధం ప్రాధాన్యతనిస్తున్నదన్న విమర్శ తలపిస్తుంది.


5. ప్రవర్తనావాదం స్థిరమైన విషయాలకు ప్రాధాన్యతనిస్తుంది. తద్వారా సమకాలీన సమస్యలైన అణ్వాయుధాలు, సంఘర్షణ, హింసాత్మక చర్యలకు గురించి చర్చించదు. ఇది సమస్యల నుండి పారిపోయే తత్వాన్ని సూచిస్తుంది.


6. ప్రవర్తనావాదం సిద్ధాంత రూపకల్పన పట్లే ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంది. ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించటంలో ప్రయోగాత్మక పరిశోధన పాత్రను విస్మరిస్తుంది.


ప్రవర్తనావాదం విస్తరణలో భాగంగా వ్యవస్థల విశ్లేషణ వృద్ధి చెందింది. రాజ్యం, ప్రభుత్వం మొదలైన పరిభాషిక పదాల స్థానంలో 'వ్యవస్థ' (System) అన్న పదాన్ని విరివిగా వాడుతున్నారు. అనేక సమాజాల్లో లాంఛన సంస్థలకు, లాంఛనేతర సమూహాలు, రాజకీయ అభివృత్తులు (Political Attitudes) వ్యక్తుల పరస్పర సంబంధాలు, మొదలైన వాటిని అవగాహన చేసుకోవటానికి, విశ్లేషించటానికి.' వ్యవస్థ' పరంగా అధ్యయనం చేయటం విస్తృతమైంది. రాజనీతి శాస్త్రంలో ప్రతి వ్యవస్థ గురించి విశ్లేషణ చాలా ముఖ్యం. అందువలన ఆధునిక కాలంలో వ్యవస్థా దృక్పదము చాలా ప్రాముఖ్యతను సంతరించుకొన్నది. వ్యవస్థలోని వివిధ అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి మరియు ఒకదాని మీద మరొకటి ఆధారపడినది. ఈ భావనను ముఖ్యంగా ప్రకృతి విజ్ఞాన శాస్త్రం నుండి ప్రధానంగా జీవశాస్త్రం నుండి గ్రహించింది. మొదట దీనిని అధ్యయనం మానవ శాస్త్రంలో అనుసరించారు. తరువాత సమాజ శాస్త్రం, మనోవైజ్ఞానిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం మొదలైన శాస్త్రీయ అధ్యయనాల్లోకి ప్రవేశించింది. రాజనీతిశాస్త్ర అధ్యయనం, విశ్లేషణలలో వ్యవస్థల సిద్ధాంతం వినియోగానికి కృషి చేసిన వారిలో రాబర్టు మెర్టన్ (Robert Mertan), టాల్కాట్ పార్సన్ (Talcot Parsen) ముఖ్యులు. రాజనీతి శాస్త్రంలో వ్యవస్థల విశ్లేషణ ఉపయోగాన్ని ప్రవేశపెట్టినవారు డేవిడ్ ఈస్టన్ (David Easten) కారల్ డ్యూష్ (Karal Deutch) కంప్లాన్ (Kaplan) లు ముఖ్యులు. వీరేకాక ఇతరులు కూడా అదే విధానంను కొనసాగించుచున్నారు. అన్ని విషయ విభాగాలకు చెందిన వ్యవస్థలను ఒక సామాన్య భావన ద్వారా అర్ధం చేసుకొని, ఆ అవగాహన ద్వారా ఒక సాధారణ సిద్ధాంతము (General System Theory) ను రూపొందించుట ఈ దృక్పధము యొక్క లక్ష్యం.


1930 సం||లో లగ్విన్ వాన్ బెర్డీన్ (Lawing Van Bertalanfly) ఈ సిద్ధాంతమును ప్రవేశ పెట్టినాడు. కార్యాచరణకు సంబంధించిన వివిధ సంస్థల, వ్యవస్థల విశ్లేషణ వివిధ రకాల పరిస్థితులలో దాని పరి తీరును వర్గీకరించి, వర్ణించి, వివరించటం లక్ష్యంగా ఉంటుంది. ఒక వ్యవస్థ పని విధానమంతా ఆది వాస్తవంగా ఏ విధంగా పని చేస్తుందనే దాని మీద ఆధారపడుతుంది. ఈ దృక్పథాన్ని డేవిడ్ ఈస్టన్ జీవశాస్త్రం నుండి గ్రహించి రాజకీయ వ్యవస్థ అనే భావనను ప్రవేశ పెట్టినాడు.



Post a Comment

0 Comments