Type Here to Get Search Results !

రాజకీయాలు - సమాజం: ఒక చారిత్రక పరిశీలన

0

 రాజకీయ సామాజిక శక్తులకు మధ్య అంతర్ చర్యలను వివరించటానికి రాజకీయ సమాజశాస్త్రం ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ విధానాన్ని సామాజిక సాంస్కృతిక నేపథ్యంలో రాజకీయ సమాజశాస్త్రం పరిశీలిస్తుంది. ఇవి ప్రభుత్వ నిర్ణయంలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. విభిన్న ఆసక్తులకు ప్రాతినిధ్యం వహించే వివిధ సామాజిక వర్గాలకు రాజకీయ వ్యవస్థ నిరంతరం ప్రతిస్పందిస్తుంటుంది. పర్యవసానంలో ప్రభుత్వం, ప్రభుత్వ విధానాలు తరచు ప్రభావితమవుతుంటాయి. విస్తృత సామాజిక ప్రక్రియలో రాజకీయ రంగం అంతర్భాగం, కులం, మతం, సాంస్కృతిక, నైతిక, భాషా పరమైన అంశాలు రాజకీయ వ్యవహార సరళిని ప్రభావితం చేస్తాయి. అందువల్ల రాజకీయ వ్యవస్థ అతి విస్తృతమైన సామాజిక- సాంస్కృతిక వాతావరణ రూపంలో పని చేస్తుంటుంది. సమాజాన్ని ప్రభావితం చేసే సామాజిక - ఆర్ధిక శక్తులకు అతీతంగా రాజకీయ వ్యవస్థ ఉనికి కొనసాగదు.

పశ్చిమ దేశాలలో రాజకీయ వ్యవస్థల అవతరణ, వృద్ధి, వ్యవహార సరళిని అనేక అంశాలు ప్రభావితం చేసాయి. పారిశ్రామికీకరణం, నగరాల వృద్ధి, కుటుంబ వ్యవస్థ, రాజ్య వ్యవహారాలలో చర్చి పాత్ర, లౌకికీకరణ మొదలైన కారకాలు అక్కడి ఉదారవాద ప్రజాస్వామ్య వ్యవస్థలకు బలమైన పునాదులను వేశాయి. స్వేచ్ఛా స్వతంత్రతలు గల పత్రికలు, రేడియో, టెలివిజన్, చలన చిత్రాలు తదితర ప్రచార మాధ్యమాలు, లౌకిక విద్య, ప్రభావ వర్గాల ఉదారవాద ప్రజాస్వామ్య వ్యవస్థల విజయానికి దోహద పడ్డాయని భావిస్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే ఆర్థికాభివృద్ధి, ఆధునికీకరణ, సాంస్కృతిక లౌకికీకరణ, నిర్మిత వైవిధ్యీకరణ (Structural Differentiation) మొదలైనవి ఉదారవాద ప్రజాస్వామ్య రాజకీయాలకు అవసరమైన మౌలిక నిర్మితులను ఏర్పాటు చేసాయి. పాశ్చాత్య దేశాలలో వివిధ సామాజిక వర్గాల మధ్య చర్య, ప్రతి చర్యలు, సామాజిక సమైక్యీకరణ మొదలైన విషయాలు క్రమంగా వివిధ రాజకీయ సంస్థల ఆవిర్భావానికి దోహదము చేసాయి.

ఇందుకు భిన్నంగా, రెండవ ప్రపంచ యుద్ధానంతరం సంపాదించుకొన్న దేశాలు, ప్రధానంగా మూడవ ప్రపంచ రాజ్యాలు, వేరే విధమైన ప్రత్యేకతలను సంతరించుకొన్నాయి. శతాబ్దాల తరబడి వలసపాలనలో ఉండి, వివిధ రకాల దోపిడీలకు గురై, స్వాతంత్ర్యాన్ని సంపాదించుకొన్న దేశాలు సామాజిక సమైక్యతా ప్రక్రియకు లోనుగా లేదు. కులం, మతం, తెగ, భాష, రక్త సంబంధాలు తదితర ప్రాధమిక విధేయతలు వాటిని నిలువునా చీల్చి, సమైక్యతకు అడ్డుగోడలుగా నిలిచిపోయాయి. వాస్తవానికి ఈ కారణాల వల్లనే అనేక దేశాలు విచ్ఛిత్తి చెందటం, లేదా నియంతల పాలన క్రిందకి రావడం జరుగుతుంది. సామాజిక సంక్షోభాలను అధిగమించటానికి, సమైక్యతను పరిరక్షించుకోవడానికి, అభివృద్ధి చెందుతున్న చాలా దేశాలు నియంతృత్వ నమూనాయే సరియైనదిగా భావిస్తున్నాయి. అధికస్థాయి. కేంద్రీకరణకు, అధికారవాదానికి, సామాజిక రాజకీయ సమైక్యతకు నియంతృత్వ వ్యవస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. పర్యవసానంలో వైవిధ్యం, భిన్నాభిప్రాయాల ప్రాతిపదికలుగా ఉన్న ప్రజాస్వామ్య నిర్మితులు, మూడో ప్రపంచ దేశాలలో క్షీణతకు లోనై వాటి స్థానంలో నియంతృత్వ నిర్మితులు రూపొందుతున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధానంతరం పాశ్చాత్యదేశాల వలస పాలన నుండి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాల చాలా దేశాలు రాజకీయ స్వాతంత్ర్యాన్ని సంపాదించుకొన్నాయి. వాటిలో చాలా దేశాలు పాశ్చాత్య రాజకీయ వ్యవస్థల నమూనాలను (Models) ఎంచుకొన్నాయి. పాశ్చాత్య రాజ్యాలలోని ఉదారవాద ప్రజాస్వామ్య సంస్థలు, భావాలను అనుసరించి మూడవ ప్రపంచ రాజ్యాలు తమదైన రాజకీయ - రాజ్యాంగ - పాలనా యంత్రాంగాన్ని రూపొందించుకొన్నాయి. అయితే ఆయా సమాజాల సామాజిక - ఆర్ధిక పరిస్థితులు అనేక వత్తిడులను సృష్టించి ఉదారవాద రాజకీయ సంస్థల సామర్థ్యాన్ని సార్ధకతను దెబ్బతీసాయి. ఈ సమాజాలలోని రాజకీయ ప్రక్రియను అక్కడి సామాజిక ఆర్థిక స్థితిగతులు నిర్ధారిస్తాయి. అందువల్ల వాటి నేపధ్యంలో ఆయా సమాజాల రాజకీయ వ్యవస్థలను మనం అధ్యయనం చేయాల్సి ఉంది.

రాజకీయ భావాలు, ఆలోచనలలో సామాజిక పరిస్థితులు ప్రధాన పాత్రను నిర్వహిస్తాయి. ఆదినుంచి రాజకీయాలను సమాజ స్వరూపం ద్వారానే పరిశీలిస్తున్నారు. రాజకీయాలకు, సమాజానికి ఉన్న సంబంధాన్ని ప్రాచీన గ్రీకు తత్త్వవేత్తలు ఆలోచనలు ధృవీకరిస్తున్నాయి. ప్రఖ్యాత గ్రీకు రాజనీతి తత్త్వవేత్తలైన ప్లేటో, అరిస్టాటిల్ రాజకీయాలను సామాజిక దృక్కోణం నుంచి సముదాయం', 'నగరరాజ్యం' మొ||లైన భావన పరంగా విశ్లేషించారు. వారి ఉద్దేశ్యంలో వ్యక్తి ప్రయోజనానికి, ఉనికికి రాజ్య లక్ష్యాలకు ఎటువంటి వ్యత్యాసం లేదు. మానవుడు సంఘజీవి, రాజకీయ జీవి అన్న అరిస్టాటిల్ ప్రవచనాలు పౌరుడు, రాజ్యం, సమాజం, వాటి మధ్యగల అంతః సంబంధాన్ని స్పష్టం చేసాయి. నిజానికి రాజ్య సిద్ధాంతము, కుటుంబము, గ్రామాలు, పట్టణాల నుంచి ఏర్పడిందే. ఆయన అభిప్రాయంలో రాజ్యం మానవుడి అత్యున్నత అభివృద్ధికి సమూహిక చైతన్యానికి ప్రతిరూపం. ఆదర్శవాద సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ప్లేటో సమాజాన్ని మూడు వర్గాలు తత్త్వ వేత్తలు, సైనికులు, బానిసలుగా శ్రేణీకరించి, వారి మధ్య సామరస్యంలో ఒక ఆదర్శరాజ్య (Ideal State) నమూనాను తన 'రిపబ్లిక్' (Republic) గ్రంధంలో రూపొందించారు. ఈ మూడు వర్గాలు తమ తమ వృత్తులలో శిక్షణ పొంది ఒకరితో మరొకరు జోక్యం చేసుకోకుండా తమ తమ కర్తవ్యాలను నిర్వహిస్తాయి. అంతటితో ఆగక పాలక వర్గానికి స్వంత ఆస్తి, కుటుంబాలు ఉండరాదన్నారు. స్వచ్ఛమైన ప్రజాజీవితానికి ఆస్తి, కుటుంబము అడ్డంకులుగా భావించి, ప్లేటో వాటిని పాలకులకు నిషేధించారు. దీనిని బట్టి సామాజిక, ఆర్ధిక పరిస్థితులు రాజకీయ వ్యవస్థను ఏ విధంగా ప్రభావితం చేస్తాయన్న ఆలోచన గ్రీకుల కాలం నుండి ప్రారంభమైందని చెప్పవచ్చు. ఆధునికయుగ ప్రారంభంలో బోడిన్, మాకియావెల్లీ, హాబ్స్ రచనలు కూడా రాజకీయ నిర్మితుల గురించి విశేషంగా చర్చించాయి. ఆస్తి, కుటుంబము రెండింటిని ఏ విధంగా సక్రమంగా నిర్వహించాలన్న అంశంపై తత్త్యవేత్తల రచనలో విశ్లేషణలు కనిపిస్తాయి. ఉదా॥ కుటుంబము, ఆస్తి అనే పునాదులపై బోడిన్ తన సిద్దాంతాన్ని రూపొందించాడు. రాజ్యస్థిరత్వంలో అవి చాలా ప్రధానమైన పాత్రను నిర్వహిస్తాయి. వాటిలో దేనికైనా ఇబ్బంది కలిగితే, లేదా అవి దెబ్బతింటే రాజ్య పునాదులే కదిలిపోతాయని బోడిన్, మాకియావెల్లీలు భోదించారు. దీనిని బట్టి రాజకీయ స్థిరత్వాన్ని సామాజిక, ఆర్ధిక సంస్థలు నిర్ణయిస్తాయన్న విషయాన్ని మనం గ్రహించవచ్చు. రాజకీయాధికారపు సార్ధకత అది కల్పించే ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుందని ఉపయోగితావాదం భావించింది. అదిక సంఖ్యాకులకు అత్యధిక సంతోషాన్ని కలిగించటమే రాజ్య పరమావధిగా ఉపయోగితావాదులు భావించారు. సామాజిక సంక్షేమాన్ని రాజ్య లక్ష్యంగా బెంధామ్ నిర్ధారించాడు. రాజకీయాలు ఉత్పత్తికి సంబంధించినవిగా కారల్ మార్క్స్ సిద్ధాంతం భావిస్తుంది. సమాజం, రాజకీయాలను ఉత్పత్తి కారకాలు, ఉత్పత్తి ప్రక్రియలు నిర్దేశిస్తాయి. ఆర్ధిక పరిస్థితుల పునాదులపై రాజకీయ వ్యవస్థ ఉపరితలం ఏర్పడుతుందని మార్క్స్ సిద్ధాంతీకరించారు. రాజకీయాలను పరిరక్షించుకోవటానికి తన గుప్పెట్లో పెట్టుకొంటుంది. ఆర్ధిక ప్రాబల్యం గల వారే రాజకీయాధికారాన్ని చలాయిస్తారు. ఆస్తి వ్యవస్థ (Institution of property) బూర్జువా, శ్రామిక వర్గాలుగా సమాజాన్ని వర్గీకరిస్తుంది. ఉత్పత్తి కారకాలపై తమకు గల గుత్తాధిపత్యం ద్వారా పెట్టుబడిదారులు శ్రామికవర్గాన్ని నిర్ధాక్షిణ్యంగా దోచుకుంటారు. ఉత్పత్తి, పంపిణీ, వినిమయాలన్నింటి పైన పెట్టుబడిదారీ వర్గానికి గుత్తాధిపత్యం ఉంటుంది. పెట్టుబడిదారులు తమ వర్గ ప్రయోజనాల కోసం ఇతరులను దోచుకోవటానికి రాజ్యం సాధనంగా మారుతుంది. అందువలన ఆర్ధిక ప్రాబల్యం ఉన్న వర్గం రాజకీయాలను శాసిస్తుందని. మార్క్సిస్టులు భావిస్తారు. ఈవిధంగా ఆర్థిక, రాజకీయ పరిస్థితులు మొత్తం సమాజాన్ని శాసిస్తాయని మార్క్స్ సిద్ధాంతము ప్రతిపాదిస్తుంది.


బహుతావాదం (Pluralism) రాజ్యానికి పరిమితమైన అధికారాని ఇచ్చి సామాజిక సంస్థలకు, సమూహాలకు ఎక్కువ స్వేచ్ఛను కల్పించాలని వాదిస్తుంది. లాస్కీ, బార్కర్, జి.డి.హెచ్, కోల్, ఫాలెట్ లిండ్సే మొదలైనా వారంతా రాజ్య జోక్యం నుండి సమాజం స్వేచ్ఛగా పనిచేయాలంటారు. సంస్థల ఆంతరంగిక వ్యవహారాలలో రాజ్యం జోక్యం చేసుకోకుండా, వాటి కార్యకలాపాలను సమన్వయ పరచాలని వారు అంటారు. ఈ విధంగా బహుత్వవాదులు సంస్థల స్వయం ప్రతిపత్తి, వ్యక్తి స్వేచ్ఛ, చొరవలకు, అధిక ప్రాధాన్యతను ఇస్తారు. పై చర్చలను బట్టి రాజ్యం సమాజాల మధ్య ఉండవలసిన సంబంధం ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు చర్చనీయాంశమైంది. రాజనీతి తత్వవేత్తలు ఈ రెండింటి మధ్య సమన్వయం సాధించటానికి కాలానుగుణంగా చాలా సిద్ధాంతాలను రూపొందించారు. రాజనీతి చట్రంలో సామాజిక ఆర్ధిక రంగాలకు అవసరమైన సాపేక్ష, స్వేచ్ఛ, పరస్పర ఆధారిత స్థితులను వివరించ ప్రయత్నించారు. ఈ నేపద్యంలో రాజనీతి శాస్త్రజ్ఞులు రాజకీయాంశాలను విశ్లేషించుటకు వివిధ దృక్పధాలను అనుసరించినారు.


దృక్పధము అనగా ఒక విషయమును ఒక క్రమ పద్ధతిలో అధ్యయనము చేసి విశ్లేషణాత్మకముగా వివరించి ఒక భావనను కలుగ జేయడం అని అర్ధం.


ఒక శాస్త్రమును అధ్యయనము చేయుటలో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ కోణాలలో పరిశీలించవలసి వుంటుంది. ముఖ్యముగా రాజనీతిశాస్త్రంను పరిగణలోనికి తీసుకొన్నప్పుడు ఆధారం, పరిశోధన, విశ్లేషణ, నిర్ధారణ మరియు ధ్యేయము అనునవి ముఖ్యమైనవి. మనము ఎన్నుకునే విషయమును బట్టి సేకరించిన సమాచారమును బట్టి, దాని విలువను బట్టి ప్రభుత్వమునకు సంబంధించిన స్వీయ, పర విషయములను అధ్యయనం చేయటం జరుగుతుంది. అందువల్ల రాజనీతిశాస్త్రం అధ్యయనాన్ని విశ్లేషించడంలో అనేక దృక్పధాలు, శిల్ప పద్ధతులు చోటు చేసుకొన్నాయి. అదే విధముగా రాజకీయ సమాజ శాస్త్రమును అవగహన చేసుకొనుటకు భిన్న దృక్పధాలు, శిల్ప పద్ధతులు వాడుకలోనికి వచ్చాయి. ఈ దృక్పధాలు, వాస్తవ రాజకీయ చర్యలను అర్ధము చేసుకొని వివరించుటకు ఎంతగానో ఉపయోగపడతాయి. రాజకీయ సామాజ శాస్త్రంలోని వివిధ దృక్పధాలను పండితులు రెండు రకాలుగా విభజించిరి. అవి: (1) సాంప్రదాయక (Traditional Approach) (2). (Modern Approach), ৯ నీతి, నియమాలపై, శాసన పరమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆధునిక దృక్పధం, వాస్తవాలు, ఆశయాలు, ప్రామాణికతలపై. విషయ సేకరణపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతము సాంప్రదాయ దృక్పధాన్ని పరిశీలిద్దాము

Post a Comment

0 Comments