My tech channel: Title: జాతీయాదాయం నిర్వచనాలు
* 2011-12 ఆధార సంవత్సరాన్ని "Advisory committee on National Accounts and Statistics (ACNAS)" కె. సుందరం అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ సూచనలతో అమలులోకి తీసుకొచ్చారు.
* 2011-12 ఆధార సంవత్సరం నుంచి 2017-18 ఆధార సంవత్సరం మార్చడానికి పరిశీలన చేయడానికి ప్రొఫెసర్ రవీంద్ర మరియు ప్రొఫెసర్ డొలకియ అధ్వర్యంలో కమిటీని నియమించింది.
జాతీయాదాయం భావనలు
స్థూల నికర ఉత్పత్తి, దేశీయ, జాతీయ ఉత్పత్తుల సహాయంతో ఆర్థికవేత్తలు 4 రకాల జాతీయాదాయ భావాలు వ్యక్తపరిచారు.
* స్థూల దేశీయోత్పత్తి (Gross Domestic Product - GDP)
* స్థూల జాతీయోత్పత్తి (Gross National Product - GNP)
* నికర దేశీయోత్పత్తి (Net Domestic Product - NDP)
* నికర జాతీయోత్పత్తి (Net National Product - NNP)
ప్రతి భావనను మరల మార్కెట్ ధరలలోను, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా గణిస్తారు. అట్లాంటప్పుడు మొత్తం 8 భావనలు వస్తాయి. అవి:
* స్థూల దేశీయోత్పత్తి: ఒక దేశ భౌగోళిక సరిహద్దు (Domestic Territory) లోపల స్వదేశీ మరియు విదేశీ ఉత్పత్తికారకాల చేత ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు, సేవల మొత్తం ఉత్పత్తి విలువను ద్రవ్య రూపంలో తెలపగా వచ్చే జాతీయ ఆదాయాన్ని "స్థూల దేశీయోత్పత్తి" అంటారు.
* దేశీయ సరిహద్దు లోపల జరిగిన ఉత్పత్తిని GDP తెలుపుతుంది. దేశ ప్రాదేశిక జలాలు (సముద్రం లోపలికి 200 నాటికల్ మైళ్ల వరకు) ఇందులో భాగమే.
* 200 GDP లో తరుగుదల కూడా ఉంటుంది.
* ఈ దేశంలోని విదేశీ రాయబార కేంద్రాలు, అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలు మినహాయించబడతాయి.
* భారతదేశం యొక్క GDP రెండు వేర్వేరు పద్దతులను ఉపయోగించి గణించబడుతుంది. మొదటిది ఆర్ధిక కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది. (కారకం ధరల వద్ద), రెండవది ఖర్చుపై ఆధారపడి ఉంటుంది (మార్కెట్ ధరల వద్ద)
* మార్కెట్ ధరల దృష్ట్యా GDP (MP)
* ఉత్పత్తి కారకాల దృష్ట్యా GDP (FC)
ఎ. మార్కెట్ ధరలలో GDPMP:
* ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి అంటారు.
GDPMP = C + I + G + (X - M)
C = వినియోగం (Consumption)
I = పెట్టుబడి (Investment)
G = ప్రభుత్వ సేవల వ్యయం
X = ఎగుమతులు (Exports)
M = దిగుమతులు (Imports)
GDPని లెక్కించేటప్పుడు వస్తు సేవల స్థూల ఉత్పత్తి విలువ నుంచి వాటి ఉత్పత్తి కోసం ఉపయోగించిన ఉత్పాదకత విలువ (Value of Inputs) తీసివేస్తే కలుపబడిన స్థూల విలువ (GVA - Gross Value Added)
బి. ఉత్పత్తి కారకాల దృష్ట్యా GDPFC:
మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తి నుండి నికర పరోక్ష పన్నులు తీసివేస్తే లభించేదే ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి అంటారు.
GDPFC = GDPMP - నికర పరోక్ష పన్నులు
GDPFC = C + I + G + (X - M) - Indirect Taxes + Subsidies
2. స్థూల జాతీయోత్పత్తి (GNP): దేశంలోని పౌరులు మరియు సంస్థలు ఉత్పత్తి చేసే అన్ని వస్తువులు మరియు సేవల మొత్తం విలువ, అవి ఎక్కడ ఉత్పత్తి చేయబడినా, స్థూల జాతీయోత్పత్తిగా (GNP) సూచించబడుతుంది.
* స్థూల జాతీయోత్పత్తి (GNP) అనేది దేశంలోని సంస్థలు, దేశం లోపల మరియు వెలుపల చేసిన పెట్టుబడులకు ఖాతా, ఇది దేశీయంగా ఆధారిత పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తుల విలువలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. > My tech channel: Title: జాతీయాదాయం నిర్వచనాలు
Body:
GNP దేశంలోని విదేశీ పౌరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని లేదా దేశంలోని తయారీ యూనిట్లలో విదేశీ వ్యాపారం ద్వారా తయారు చేయబడిన ఏదైనా ఉత్పత్తులను కలిగి ఉండదు.
* GNPని లెక్కించేటప్పుడు తుది వస్తువులు మరియు సేవలు మాత్రమే పరిగణనలోకి తీసుకోబడతాయి. ఇంటర్మీడియట్ ఉత్పత్తులను నివారించడం ద్వారా డబుల్ లెక్కింపు నిరోధించబడుతుంది.
* దేశం యొక్క GNP ని లెక్కించేటప్పుడు ఈ కింది అంశాలు పరిగణనలోకి తీసుకోబడతాయి.
* వినియోగ వ్యయం
* పెట్టుబడి
* ప్రభుత్వ వ్యయం
* నికర ఎగుమతులు
* నికర ఆదాయం
* GNPని లెక్కించడానికి క్రింది సూత్రం ద్వారా లెక్కిస్తారు.
* GNP = వినియోగవ్యయం + పెట్టుబడి + ప్రభుత్వ వ్యయం + నికర ఎగుమతులు + నికర ఆదాయం.
* దేశ సాధారణ నివాసి విదేశాల్లో ఉత్పత్తి చేసి ఆర్జించిన ఆదాయంను కలపాలి. దీనిని రాబడులు (Receipts) అంటారు.
* దీనిని 2 రకాలుగా భావించవచ్చు. అవి:
ఎ. మార్కెట్ ధరల్లో GNPMP
బి. ఉత్పత్తి కారకాల దృష్ట్యా GNPFC
ఎ. మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి GNPMP:
* ఒక దేశ పౌరులు ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువనే స్థూల జాతీయోత్పత్తి అంటారు.
* GNP MP = GDP MP + (R - P)
* GNPMP = C + I + G + (X - M) + (R - P)
* R = Receipts (రాబడులు)
* P = Payments (చెల్లింపులు)
* R - P = నికర విదేశీ కారక ఆదాయం (NFIA - Net Factor Income from Abroad)
* GNP MP = GDP MP + NFIA
* NFIA = GNPMP - GDPMP
1. స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తికి మధ్య గల వ్యత్యాసమే నికర విదేశీ కారక ఆదాయం.
బి. ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి GNPFC
* మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి నుండి నికర పరోక్ష పన్నులు తీసివేస్తే ఉత్పత్తికారకాల దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి వస్తుంది.
* GNPFC = GNP MP - నికర పరోక్ష పన్నులు
* GNP FC = GNP MP - Indirect Taxes + Subsidies
3. నికర దేశీయోత్పత్తి
* స్థూల ఉత్పత్తి విలువలలో (GDP, GNP) తరుగుదల కలిసి ఉంటుంది. కాబట్టి (GDP, GNP)లు ఆర్థిక వ్యవస్థలో ఉన్న వాస్తవమైన వస్తు, సేవల ప్రవాహాన్ని తెలుపవు. అందువలన స్థూల ఉత్పత్తికి బదులుగా నికర ఉత్పత్తిని పరిగణించవలెను.
* స్థూల ఉత్పత్తి విలువ నుంచి తరుగుదల తీసివేయగా నికర ఉత్పత్తి వస్తుంది.
నికర ఉత్పత్తి = స్థూల ఉత్పత్తి - తరుగుదల
NDP = GDP - తరుగుదల
4. నికర జాతీయోత్పత్తి: స్థూల జాతీయోత్పత్తి (GNP) నుంచి తరుగుదల లేదా స్థిర మూలధన వినియోగాన్ని తీసివేయగా మిగిలిన జాతీయాదాయ భావనను నికర జాతీయోత్పత్తి (NNP) అంటారు.
* నికర జాతీయోత్పత్తి - స్థూల జాతీయోత్పత్తి - తరుగుదల
NNP = GNP - తరుగుదల
NNP = GNP - తరుగుదల = (GDP + NFIA) - తరుగుదల
NDP = GDP - తరుగుదల = (GNP - NFIA) - తరుగుదల
NNP = NDP + NFIA
GDP = GNP - NFIA