సమాజం, రాజకీయాలను నేడు ప్రత్యేకాంశాలుగా భావిస్తున్నప్పటికీ; ప్రాచీన, మధ్య యుగాలలో ఈ ప్రత్యేకతా భావం గాని, వీటి మధ్య వైరుధ్యాలుగాని లేవు. గ్రీకులు, రోమనుల కాలాల్లో మానవుని పూర్తిగా రాజకీయ సమాజ సభ్యుడుగానే భావించేవారు. కాని పవిత్ర రోమన్ సామ్రాజ్య కాలంలో మానవుని విదేయతను చర్చితో అయిష్టంగానైనా పంచుకోవడం జరిగింది. 16,17 శతాబ్దాలలో సంభవించిన మత, ఆర్థిక, రాజకీయ సంఘటనల ఫలితంగా సమాజం, రాజకీయాలు క్రమక్రమంగా వేరు పడటం కొనసాగుతుంది. 18వ శతాబ్దం నాటికి బ్రిటిష్, (ఫ్రెంచి తత్వవేత్తలు ఈ రెండూ ఒకటికి మరొకటి పర్యాయ వ్వవస్థలు కావని అవి రెండూ వేర్వేరని, రాజ్యం ఎంతో ఉన్నత వ్యవస్థ అయినప్పటికీ సామాజిక వ్యవస్థలో అది అంతర్భాగమని భావించటము జరిగింది. 19వ శతాబ్దపు మేధావులైన సెయింటు సైమన్, కామ్టే, మార్క్స్, విప్లవ యుగపు ప్రభావము సామాజిక రాజకీయ వ్యవస్థలపై ఏ విధంగా ఉండునోయని తమ జిజ్ఞాస (Concern) ను వ్యక్తపరచారు. పారిశ్రామిక విప్లవం ఆర్థికంగా, ప్రత్యేకత ప్రాతిపదికగా ఉన్న భూస్వామ్య విధానం, క్రమానుగత పద్ధతిలో వ్యవస్థీకృతమైన వర్గవ్యవస్తల ఆధారం చేసుకొని, సాంప్రదాయంగా వస్తున్న మత, రాజకీయ శిష్టుల ప్రభావాన్ని విచ్ఛిన్నం చేసింది. అమెరికా స్వాతంత్ర్య పోరాటం, ఫ్రెంచి విప్లవం, రాజరికం వలస ప్రభుత్వాల రాజకీయ అధికారాన్ని ప్రాబల్యాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి వాటి శాసనబద్ధతను, వ్యవస్థలను సంపూర్ణంగా మార్చివేసాయి. త్వరితగతిలో సామాజిక రాజకీయ మార్పులను తెస్తున్న ఈ కాలం రెండు సమస్యలను సృష్టించింది. అవి సామాజిక వ్యవస్థ. వ్యక్తి స్వేచ్చా స్వాతంత్ర్యాలకు సంబంధించిన అంశాలు. దీని పర్యావసానంలో ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తింది. ఏ విధమైన ప్రజాస్వామ్య వ్యవస్థ, సాంప్రదాయకంగా వస్తున్న మత రాజకీయ అధికారాన్ని స్థాన భ్రంశంచేయునన్నదే ఈ ప్రశ్న.
20వ శతాబ్దపు సమాజ రాజకీయ శాస్త్రజ్ఞులు దృష్టి, సమాజం, రాజకీయ వ్యవస్థలపై, సమైక్యతపై, వ్యక్తి పౌర హక్కుల రక్షణలపై కేంద్రీకరింపబడింది. బలమైన జాతిరాజ్యాలు (Mass Societies) ఏర్పాటువుతున్న తరుణంలో రాజకీయ, సమాజ వ్యవస్థల స్వరూప స్వభావాలు ఏ రకంగా ఉంటాయన్న భావన మేధావి వర్గాలలో ఉత్పన్నం అవుతున్నది. ప్రజా బాహుళ్యం నుండి న్యాయబద్ధమైన మద్దతు, విశ్వాసంలేని దీర్ఘకాలిక, కట్టుదిట్టమైన వ్యవస్థను నెలకొల్పుట గాను రాను కష్టతరమని కొత్త రాజకీయ ప్రభుత్వాలు భావించనారంభించాయి. అధికారం ప్రాబల్యాలను సంపాదించటంలో, పంచుకోవటంలో, అనుభవించటంలో ఎంపిక చేసే పద్దతుల గురించి ఉమ్మడి అభిప్రాయానికి రావడాన్ని కీలకమైన అంశంగా భావించవచ్చు. రాజకీయ వ్యవస్థను కాని, సమాజం లేదా సమాజాల మధ్య అధికార విభజనను అధ్యయనం చేయాలంటే ఆ అధికారం వెనుక ఉన్న సాంఘిక శక్తులు, కారకాలు, వాటి ప్రభావాన్ని తప్పని సరిగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అటువంటప్పుడు ప్రాబల్యం, అధికారం, అధికారపు వివిధ స్వరూపాలు, విధాన నిర్ణయాల వెనుకగల సామాజిక కారకాలు, విధాన, శాసన నిర్మాణంలో జోక్యం, క్రమం, మొదలైన అన్ని చర్యలు, సమాజం పై వాటి ప్రభావం రాజకీయ సమాజ శాస్త్రజ్ఞల దృష్టిని ప్రధానంగా ఆకర్షించాయి.
సాంప్రదాయక సమాజ పద్దతుల స్థానే ఆధునిక జరిగి రాజకీయ సామాజిక శాస్త్రం ఆవిర్భవించి రాజకీయమునకు, సమాజమునకు మధ్య కొన్ని ప్రాధమిక భావనలను వేరు చేయుట ద్వారా సామాజిక రాజకీయ శాస్త్రము నుండి రాజకీయ సామాజిక శాస్త్రం ఆవిర్భావము జరిగింది. దీనికి 20వ శతాబ్దపు రచయితలైన ప్రముఖ సామాజిక . శాస్త్రవేత్తపైన మాక్స్వెబర్, రాబర్టు మిచిల్స్, మోస్కా, పెరటో, డర్క్ హెూమ్ రచనల ద్వారా ఈ వాస్త్రము అభివృద్ధి చెందినది.
రాజకీయాభివృద్ధి గురించి చర్చించినప్పుడు రాజనీతి శాస్త్రజ్ఞలు అభివృద్ధి చెందిన దేశాలలో పాశ్చాత్య దేశాలలో ఉన్న రాజకీయ వ్యవస్థను ఆదర్శవంతమైన వ్యవస్థగా తీసుకొన్న రాజకీయ కార్యకలాపాలలో లౌకికంగా భాగస్వామ్యం తీసుకొన్న రాజకీయ వ్యవస్థ ఇతర సామాజిక వ్యవస్థలతో విడిపోయినప్పుడు వివిధ కార్యకలాపాలను, సమస్యలను సమర్ధవంతంగా నిర్వర్తించగలిగినప్పుడు దాన్ని అభివృద్ధి చెందిన ఆదర్శ వ్యవస్థగా భావించమన్నారు.
అభివృద్ధి చెందిన దేశాలలో ఆధునిక, ప్రాచీన సాంప్రదాయాల మధ్య ఉన్న వ్యతిరేకత ముఖ్య సమస్యగా తీసుకొన్నారు. పాశ్చాత్య దేశాల ప్రభావంతో ఈ దేశాలలో ప్రజాస్వామ్యం, పాశ్చాత్య విలువలు ప్రవేశించినప్పటికి ఇంకా సాంప్రదాయిక విలువలు పాతుకొని ఉండటం వలన చెప్పుకొదగిన అభివృద్ధి లేదని అంటే పాశ్చాత్య విలువలు విస్తృతంగా ప్రచారంలోకి వస్తే గాని ఏ బడుగు దేశమైనా అభివృద్ధి చెందదని అర్ధము.
పార్టీలు, ప్రభావ వర్గాలు రాజకీయ ప్రక్రియలో ప్రజల పాత్రల విషయాలపైన కూడా విస్తృతంగానే వరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనలకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు-
1) వ్యవస్థ కొంత పరిణితి చెందిన తరువాతే రాజకీయ పార్టీలు ఆవిర్భవిస్తాయి. విధానాలకు, సంక్షోభాన్ని అరికట్టడానికి ప్రజలు మద్దతులను పొందటం వీటి ముఖ్య లక్షణం. “విధాన నిర్ణయంలోను, నాయకుల ఎంపికలోనూ ప్రజల పాత్రను శ్రేష్టులు (Elites) గుర్తించాలనే సిద్ధాంతము మూలంగానే రాజకీయ పార్టీలు ఆవిర్భవిస్తాయి. నియంతలు కూడా ప్రజలను అదుపులో ఉంచటానికి పార్టీలను ఉపయోగించుకుంటారు." అంటే ప్రజల పాత్రను గుర్తించిన శ్రేష్టులే పార్టీల ఆవిర్భావానికి ప్రముఖ పాత్ర వహిస్తారు. కనుక పార్టీ వ్యవస్థ వలన ఎవరికి లాభం చేకూరుతుందో అన్న విషయం గురించి సమగ్రమైన చర్చ లేదు.
2) రాజకీయ అభివృద్ధిపైన వచ్చిన అనేక రచనలు రాజకీయాలలో ప్రజలు పాల్గొనడం అవసరమని పేర్కొన్నప్పటికి, వ్యవస్థకు మద్దతునిస్తూ పాల్గొనడాన్నే భాగస్వామ్యంగా భావించారు. అంటే వ్యవస్థను పటిష్టం చేయడానికే ప్రజలు రాజకీయాలలో పాల్గొంటారనే భావనను బలపర్చారు.
3) ఓటింగ్ను ప్రభావితం చేసే కారణాలను తెలుసుకోవడానికి చాలా దేశాలలో ప్రయత్నాలు జరిగాయి. కుల, మత వ్యవస్థల ప్రభావం, పార్టీల ఆర్థిక స్థాయి వంటి అంశాల పాత్రను నిశితంగా పరిశీలించారు. అయితే ఇలా ఎన్నికలలో గెల్చిన ప్రభుత్వం తీసుకొనే విధానాలు ఎవరికి అనుగుణంగా ఉంటాయి అన్న అంశాన్ని విస్మరించారు. ఉదా॥ భారతదేశంలో ప్రభుత్వ విధానాలు ధనిక రైతులకే లాభదాయకంగా ఉన్నట్లు తేలింది. సన్నకారు రైతులు ఉత్పత్తి చేస్తున్న జనుము, వరి, అపరాలు కంటే ధనిక రైతులు ఉత్పత్తి చేస్తున్న గోధుమ, పొగాకు, మిర్చి, పత్తికే ప్రభుత్వం ప్రాధాన్యత నిచ్చింది.
పై అంశాలతో పాటు క్రింది అంశాలు కూడా రాజకీయ సమాజ శాస్త్ర పరిధిలో ప్రధాన అంతర్భాగంగా భావించబడుతున్నాయి.
ఇతర అంశాలు
ఒటింగ్ ప్రవర్తన
ఆధనిక రాజ్యాలలో అత్యధిక రాజ్యాలు ప్రజాస్వామ్య రాజ్యాలైనందున ప్రజాస్వామ్యంలో 'ఓటు' అత్యంత శక్తివంతమైన సాధనం. అత్యంత విలువైన ఓటును, పౌరుడు స్థానిక రాజకీయాలు మొదలుకొని జాతీయ రాజకీయాల వరకు ఎలా ఉపయోగిస్తున్నాడు, ఓటింగ్ ప్రవర్తనను వివిద సాంఘికార్దిక కారకాలు ఏ విధంగా నిర్దేవించుచున్నవి, మొదలైన విషయాలను రాజకీయ సమాజ శాస్త్రం రకరకాల పరిశోధనా పద్ధతుల ద్వారా అధ్యయనం చేస్తుంది.
ఆర్థిక అధికార కేంద్రీకరణ
రాజకీయ సమాజ శాస్త్రం ఆర్థికాధికారం విధాన నిర్ణయీకరణను ప్రభావితం చేసే అంశమునే కాక రాజకీయాధికారం ఆర్థికాధికారాన్ని ఏ విధంగా నిర్దేశించగలదనే పరిశోధించగలరు. ఉదా॥ అధికార పార్టీ సంపన్నులు, సంపన్న ప్రతినిధులతో
కూడి వున్నా లేక సంపన్నులు, భూస్వాములు, శాసన సభ్యులు అయినప్పటికి ఆర్థిక వికేంద్రీకరణకు, పరిశ్రమల జాతీయీకరణకు, బ్యాంకుల జాతీయీకరణ, భూకమతాల పరిధులు మొ॥ విధానాలను రూపొందించడం జరుగుతూనే ఉన్నది.
రాజకీయ ఉద్యమాల, ప్రయోజన వర్గాల సిద్ధాంతాలు
రాజకీయ సమాజ శాస్త్రం ప్రపంచంలో నలుమూలల సంభవించిన, తల ఎత్తుతున్న ఉద్యమాలకు గల ప్రాధమిక కారకాలను, ఉద్యమాలకు ఆధారమైన సిద్ధాంత అంశాలను క్షుణ్ణంగా పరిశోధిస్తుంది. అదే విధంగా ఆధునిక రాజ్యాలలో అత్యంత చురుకైన పాత్రను నిర్వహిస్తున్న ప్రభావ ప్రయోజన వర్గాల పూర్వపరాలను, వాటి సిద్ధాంతాలను అని ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసే తీరు తెన్నులను కూడా రాజకీయ సమాజ శాస్త్రం కూలంకషంగా చర్చిస్తుంది.
రాజకీయ పార్టీలు, స్వచ్ఛంధ సంస్థలు
ప్రజాస్వామ్య రాజ్యాలలో రాజకీయ పార్టీలు కీలకమైన పాత్రను నిర్వహిస్తున్నాయి. రాజకీయాభివృద్ధి క్రమంలో రాజకీయ పార్టీల స్వభావం, ఆధారం, ఆశయాలు కార్యక్రమాలలో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. అదే విధంగా ఆధునిక సమాజంలో సాంఘిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఎంతో ముఖ్య పాత్రను నిర్వహిస్తున్నాయి. రాజకీయ సమాజశాస్త్రం వీటన్నింటి నిర్మాణం, ఆధార ఆశయాల కార్యక్రమాలను, వాటికి రాజకీయాలకు గల సంబంధంను సాక్షీభూతమైన ఆధారాలతో పరిశీలిస్తుంది.
ప్రభుత్వం ఉద్యోగిప్వాన్యుం
రాజకీయ సమాజ శాస్త్రం ప్రభుత్వ స్వరూపం, స్వభావం, నిర్మాణం, పని చేయు విధానాన్ని చర్చిస్తుంది. అధికారం రాజకీయేతర సంస్థలను ప్రభావితం చేయడం, వాటి ద్వారా ప్రభావితం చేయబడే ప్రక్రియలను లోతుగా పరిశీలిస్తుంది. ప్రభుత్వ యంత్రాంగ కీలక భాగాలైన ఉద్యోగిస్వామ్య స్వభావం, నిర్మాణం, సమస్యలు, విధాన నిర్ణయీకరణ అమలులో వీరి పాత్రను అధ్యయనం చేస్తుంది.
రాజకీయ ప్రవర్తన యొక్క సామాజిక పునాదులు
సమాజశాస్త్ర వివిధ పరిశోధనా భావాలు, పద్ధతులు సహాయం చేసే రాజకీయ సంస్థలను, రాజకీయ ప్రవర్తనను అధ్యయనం చేయడం రాజకీయశాస్త్ర ప్రధాన లక్ష్యాలలో ఒకటి. ద్వితీయ ప్రపంచ సంగ్రామం పిదప వివిధ పరిశోధనా పద్దతులచే రాజకీయ భావాలను తెలుసుకోవడం, ఓటింగ్ ప్రవర్తనను పరిశోధించడం ఈ శాస్త్రంలో ప్రధానమైన విషయంగా కొనసాగుతున్నది.
ఈ అధ్యయనము క్రింద రాజకీయ ప్రవృత్తిలో వ్యక్తులు ఏ విధముగా భాగస్వాములౌతారు? వారి ప్రవర్తనకు సామాజిక అంశములు ఏ విధముగా పునాదులు అవుతాయి? అనే ప్రాదమిక అంశములను రాజకీయ సామాజిక ఆధ్యయనములో పరిశీలించుట జరుగుతుంది. వ్యక్తులు ఏ విధంగా ఓటువేయుటలో తమ అభిప్రాయాలను మార్చుకుంటారు ? ఎందులకు రాజకీయ పక్షాలకు మద్దతు ప్రకటిస్తుంటారు? అనే అంశాలను ఈ విషయ పరిధి క్రింద అధ్యయనము చేయుట జరుగుతుంది.
రాజకీయ సామాజిక శాస్త్రమా ? లేదా సమాజ రాజకీయ శాస్త్రమా ?
రాజకీయ సామాజిక శాస్త్ర అధ్యయనం ప్రారంభమై దాదాపుగా 4,5 దశాబ్దాలు గడిచినప్పటికీ దీని నామకరణంపై తర్కం కొనసాగుతూనే ఉన్నది. రెండు శాస్త్రాల కలయికచే ఏర్పడుట వలన కొందరు దీనిని రాజకీయ సామాజిక శాస్త్రమనగా, మరికొందరు సమాజ రాజకీయ శాస్త్రమని పిలుస్తున్నారు. సమాజ రాజకీయ శాస్త్రమనే నామం బట్టి రాజనీతి శాస్త్రం, ఇతర సామాజిక ఉప శాస్త్రాల వలె సమాజ శాస్త్రంలో ఒక ఉపభాగం అనే భావన గోచరిస్తుంది. కుటుంబం, నగరీకరణ, నేరం, విద్యా మొదలైన విషయాలు గురించి చేసే అధ్యయనంలో సమాజ శాస్త్రం ప్రశంసనీయమైన అభివృద్ధి సాధించినప్పటికీ రాజకీయాలను సమాజ శాస్త్రజ్ఞులు రాజనీతి శాస్త్రజ్ఞుల కంటే మిన్నగా అధ్యయనం చేస్తున్నారనే భావన ఉన్నది. వాస్తవ (Facts), విరుద్ధ, స్వతంత్ర చలంకాలు (Independent Veriables), సాంఘిక పరిస్థితులచే ప్రభావితం చేయబడే రాజకీయాల ఆధ్యయనాన్ని సమాజ రాజకీయ శాస్త్రం అనడమే సమంజసం