Type Here to Get Search Results !

రాజకీయ సమాజ శాస్త్ర పరిథి

0

  మానవుడు సంఘజీవి. మానవుడు తన తోటి వ్యక్తులతో కలసి మెలసి జీవించడమేగాక, ఉన్నతంగా జీవించడం మానవుని ఆశయమైనందున ఉన్నత జీవనానికై మానవుడు నిరంతరం ప్రకృతితో, సమాజంతో పోరాటం సాగిస్తున్నాడు. కాలక్రమంలో మానవుడు ఎంతో విజ్ఞానాన్ని సంతరించుకొన్నాడు. అట్టి విజ్ఞాన భాండాగారాన్ని స్థూలంగా 1. భౌతిక శాస్త్రాలు (Physical Science) 2. సామాజిక శాస్త్రాలు (Social Science) గా విభజింపవచ్చు. మానవుడు సమాజ సభ్యుడుగా సమాజపు వివిధ రంగాలలో ప్రవర్తించే తీరుతెన్నులను అధ్యయనం చేసేవే సామాజిక శాస్త్రాలు. అనగా మానవ ఆర్థిక, రాజకీయ, నైతిక, మత, సామాజిక ప్రవర్తన అధ్యయనం రెండు మూడు శతాబ్దాలకు ముందు సమాజ సమస్యలు స్వల్పమైనందున సమాజ సమస్యలను అధ్యయనం చేయడానికి విభిన్న సామాజిక శాస్త్రాలు ఆవిర్భవించలేదు. సమాజ సమస్యల అధ్యయనాలన్ని ఒకే శాస్త్ర పరిధిలో ఉండేవి. 18వ శతాబ్దంలో ఇంగ్లాండులో వచ్చిన పారిశ్రామిక విప్లవం ఫలితాలు ప్రపంచంలోని వివిద ప్రాంతాలకు విస్తరించడం వల్ల సమాజ స్వరూపంలో విప్లవాత్మకమైన మార్పులు సంభవించాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము వృద్ధి, పారిశ్రామిక విప్లవాల ఫలితంగా సమాజంలో మార్పులతోపాటుగా, సమాజ సమస్యలు సంక్లిష్టమవుతూ వచ్చాయి. రోజు రోజుకు ద్విగుణీకృతమౌతున్న సమాజ సమస్యలను పరిమిత సామజిక శాస్త్రాల సమిష్టి అధ్యయన పద్ధతి సంతృప్తికరంగా విశ్లేషించలేక పోయింది. తత్ఫలితంగా వివిధ సామాజిక సమస్యల పరిశీలనకై ప్రత్యేక అధ్యయన శాస్త్రాలు ఆవిర్భవించాయి. ప్రత్యేకీకరణ పిదప ప్రతి సామాజిక శాస్త్రం తన పరిధులను రూపొందించుకొని, ఆ పరిధిలోనే అంశాలను ప్రత్యేకంగా అధ్యయనం చేస్తూ వచ్చింది.

సమకాలీన సమాజశాస్త్రంలో రాజకీయ సమాజ శాస్త్రం ఒక ఉప విషయంగా ప్రాధాన్యతను సంతరించుకొని ఒక ప్రత్యేక అధ్యయనాంశంగా రూపుదిద్దుకొంటున్నది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల్లో రాజకీయ సమాజ శాస్త్రం అధ్యయనాంశంగా రూపొందటమే ప్రాధాన్యతను ప్రకటిస్తున్నది.


1.3 రాజకీయ సమాజ శాస్త్రం


సమాజ శాస్త్రానికి ఆంగ్ల భాషలో సోషియాలజీ పదాన్ని ఆగస్టు కామ్టే ప్రవచించారు. సమాజ అధ్యయనమే సమాజ శాస్త్రం. సామాజిక విశ్లేషణకు సమాజమే (Society) ప్రాతిపదికయని కామ్టే భావించెను. కుటుంబము, రాజకీయ, ఆర్థిక, మత సంస్థలు, వాటి మధ్య పరస్పర సంబందాలు విశ్లేషణలో ఉప అంతర్భాగాలుగా ఉంటాయి. సామాజిక సమూహాలను, మానవ సంస్థలు, వాటి పరస్పర సంబంధాలను కూడా అది అధ్యయనం చేస్తుంది. వివిధ సామాజిక సందర్భాలలోని మానవ ప్రవర్తనలను కూడా సమాజ శాస్త్రం చర్చిస్తుంది.

మానవుల మధ్య ఏర్పడే వివాదాలను పరిష్కరించుటకు రాజకీయ శాస్త్ర ప్రధాన లక్ష్యం. సమాజం నిర్ణయం చేసే ప్రక్రియలను, రాజకీయ పరిణామాలను, వనరుల సాధికారిక కేటాయింపులను, విలువలను, శక్తిని వినియోగించటం, సమాజంలోని వివిధ ప్రభావాలు మొ॥ విషయాల అధ్యయనం కూడా రాజకీయ శాస్త్ర లక్ష్యాలే. ఈ విషయాలన్నింటిని రాజనీతిజ్ఞులు అధ్యయనం చేస్తారు.


రాజకీయ శాస్త్ర అధ్యయన ప్రధాన లక్ష్యం శక్తి ప్రధానంగా సామాజిక శక్తి. సమాజంలో సహచరులతో మానవుడు తన సమస్యలను పరిష్కరించుకొనే వివిధ వర్గాల గురించి రాజనీతి శాస్త్ర అధ్యయనాలు పరిశీలిస్తుంటాయి. రాజనీతి శాస్త్రం మానవుల సమస్యలను అధ్యయనం చేస్తుంది. సమస్యల పరిష్కారానికి రూపొందిన యంత్రాంగం, పరిష్కారాన్ని ప్రభావ పరిచిన మూలకాలు, మానవ సంబంధాలను ప్రభావ పరిచిన వివిద ప్రభావాలను కూడా రాజనీతి శాస్త్రం అధ్యయనం చేస్తుంది. రాజకీయ శాస్త్ర అధ్యయనాల్లో సమాజశాస్త్ర ప్రాధాన్యతను రాజనీతి శాస్త్రజ్ఞలు చాలాకాలం నుండి గుర్తిస్తున్నారు. కారల్ మార్క్స్ మాక్స్వెబర్, మోస్కా పరేటో, మిచెల్స్ సిద్ధాంతాలన్నీ రాజనీతి శాస్త్ర అధ్యయనాలను ప్రభావపరిచాయి. సమాజశాస్త్ర అధ్యయనాలు రాజకీయ శాస్త్ర అధ్యయనానికి సామాజిక వాతావరణంలోని అనేక విషయాలను వెలుగులోకి తెచ్చాయి. రాజకీయాలకు సమాజానికి: సామాజిక ప్రవర్తనలకు రాజకీయ ప్రవర్తనకు మధ్యగల సంబంధాల అధ్యయనం రాజకీయ సమాజ శాస్త్ర రంగమని చెప్పవచ్చు. ప్రభుత్వం సమాజానికి, నిర్ణయ కల్పన అధికారులకు, సంఘర్షిస్తున్న సామాజిక శక్తులకు సంస్థలకు మధ్యగల అంతర్ సంబంధాలను అర్ధం చేసుకోనటానికి

రాజకీయ సమాజశాస్త్రం సహాయ పడుతుంది. వివాదాల పరిష్కారానికి ఏర్పాట్లు, వివిధ సమస్యల వ్యక్తీకరణలు రాజకీయ సమైక్యత, వ్యవస్థీకరణం మొ॥ సమస్యలను రాజకీయ సమాజ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. వీటన్నింటికి పరస్పర సంబంధాలున్నాయి. రాజకీయ విశ్లేషణలో రాజకీయ సమాజ శాస్త్రం కొత్త మార్గాలను పద్దతులను ఏర్పరచింది. రాజకీయ శక్తి ఆర్థిక ప్రాతిపదికను కారల్ మార్క్స్ సైద్దాంతికంగా వివరించారు, అది రాజకీయ సమాజ శాస్త్రానికి పునాదులు వేసింది. ప్రభుత్వ స్వరూప స్వభావాలను, రాజకీయ సమగ్రవాస్తవాలను అధ్యయనం చేయాలని పరేటో, మోస్కా, మిచెల్స్, మాక్స్ వెబర్లు రాజకీయాల స్వయం ప్రతిపత్తిని సమర్దిస్తునే మార్క్స్ సిద్ధాంతాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ స్వరూప స్వభావాలను, రాజకీయ సమగ్ర వాస్తవాలను అద్యయనం చేయాలని వారందరూ అభిప్రాయపడ్డారు. రాజకీయ సమాజశాస్త్రం సమాజం, రాజకీయాల మధ్య గల సంబంధాలను అధ్యయనం చేస్తుంది. రాజకీయ సమాజ శాస్త్రజ్ఞులు ప్రధానంగా రాజకీయాలకు గల సామాజిక పునాదులు, రాజకీయ ప్రక్రియ; సమాజం, సంస్కృతులపై రాజకీయ ప్రభావాల మద్యగల సంబంధాలపై తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. సమాజశాస్త్రం, రాజనీతి శాస్త్రం మద్యగల పరస్పర చర్యల (Interaction) ఫలితమే రాజకీయ సమాజ శాస్త్రం. సామాజిక శాస్త్రజ్ఞలు తమ దృష్టిని సామాజిక నిర్మితులు, సామాజిక మార్పు: స్థిరీకరణ, వర్గములు, వ్యవస్థలు, చలనం (Mobility) సామాజిక వ్యవస్థలపై కేంద్రీకరించినట్లైతే; రాజకీయ శాస్త్రజ్ఞులు చట్టం, స్థానిక, రాష్ట్ర, జాతీయ, ప్రభుత్వాలు ప్రభుత్వాల తులనాత్మక అధ్యయనం, రాజకీయ వ్యవస్థలు, పాలనా యంత్రాంగం, అంతర్జాతీయ సంబంధాలపై తమ దృష్టిని కేంద్రీకరించారు. రాజకీయ సామాజిక శావస్త్రజ్ఞులు రాజకీయాభివృద్ధి, శిష్టులు, సామాజిక రాజకీయ వ్యవస్థలు, శక్తి, సామాజిక శక్తి, రాజకీయ సామాజికీకరణం, రాజకీయ సిద్ధాంతాలు, రాజకీయ పార్టీలు, ఓటింగ్ ప్రవర్తన, ఘర్షణలు, సామాజిక ఉ ద్యమాలు మొ|| అంశాలపై తమ దృష్టిని సారిస్తున్నారు.


1.4. రాజకీయ సమాజ శాస్త్రం - నిర్వచనాలు

1) రాజకీయ సమాజశాస్త్రం రాజ్యం, సంఘం చర్యలను పరిశీలిస్తుంది. (Political Sociology examines the interaction between the society and polity)

2) రాజకీయాల సామాజిక ప్రాతిపదికను క్షుణ్ణంగా పరిశీలించేదే రాజకీయ సమాజ శాస్త్రం.

3) సమాజ శాస్త్రంలో రాజకీయ సమాజ శాస్త్రం ఒక భాగం. అది ఒక సమాజంలో లేదా సమాజాల మధ్య అధికార పంపిణీ, సాంఘీక కారణాలకు, ఫలితాలకు సంబంధించినది. అధికార కేటాయింపులో మార్పులకు దారితీసే సాంఘిక రాజకీయ సంఘర్షణకు సంబంధించినది.


4) సాంప్రదాయిక రాజనీతి శాస్త్రానికి భిన్నంగా, రాజకీయ సమాజ శాస్త్రం మానవ రాజకీయ ప్రవర్తనను, రాజకీయ ప్రవర్తనను నిర్దేశించే కారకాలను, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసే వివిధ అంశాలను విశ్లేషిస్తుంది.

5) వ్యక్తుల రాజకీయ ప్రవర్తనను, సామాజిక, ఆర్ధిక అంశాలను ప్రభావితం చేసే ప్రక్రియను, సామాజిక ఆర్ధిక పరిస్థితులను, రాజకీయ సంస్థలను ప్రభావితం చేసే ప్రక్రియను అధ్యయనం చేసేదే రాజకీయ సమాజ శాస్త్రం.

6. ఒక సాంఘిక సందర్భంలో అధికారానికి సంబంధించినదే రాజకీయ సమాజ శాస్త్రం. ("Political Sociology is concerned with the power in its social context")

7. "రాజకీయాల ఉపరితల అంశాలపై కేంద్రీకరించేది రాజకీయ శాస్త్రమైతే రాజకీయాల అంతర్గత అంశాలపై కేంద్రీకరించేది రాజకీయ సమాజశాస్త్రం”. (Political Science has tendered to concentrate on the visible part of the political sociology has paid greater attention to the submerged portions).


1.5 రాజకీయ సమాజ శాస్త్ర అవతరణ


ఇంగ్లాండ్లో ఉద్భవించిన పారిశ్రామిక విప్లవ ఫలితంగా దినదినం సమాజ సమస్యలు అధికం కావడం వలన, ప్రత్యేక నైపుణ్యం మినహా వాటిని విశ్లేషించలేమని తలంచిన సామాజిక శాస్త్రాలు, పెక్కు స్వతంత్ర శాస్త్రాలుగా విడిపోయి నాలుగవ దశ : ఈ దశ సమకాలీన రాజకీయ సమాజశాస్త్ర కాలం. ఈ దశలో సమాజ్ రాజకీయాలను, లౌకికదృక్పథంతో, అనుభవవాద పద్ధతులలో విశ్లేషించుట జరుగుతున్నది.

రాజకీయ సమాజ శాస్త్ర పురాతన యుగపు ప్రతి నిధులు ప్లేటో, అరిస్టాటిల్, సిసిరో, సెయింట్ ఆగస్టీన్, సెయింట్ థామస్, అక్వినాస్లను పేర్కొనవచ్చు. వీరు సామాజిక వర్గాలు, రాజకీయాలపై వాటి ప్రభావం, రాజకీయ ప్రక్రియలపై ప్రభావం ఏ విధంగా ఉంటాయన్న అంశాలపై తమ దృష్టిని కేంద్రీకరించారు. ప్లేటో, అరిస్టాటిల్ రాజ్యపు సామాజిక పునాదిపై తను దృష్టిని సారించారు. వీరిద్దరూ రాజ్య ఆవిర్భావం వ్యక్తుల అంతర్ ప్రేరణల కారణంగా సహజమైన విషయంగా భావించారు. పురాతన యుగపు రచయితలు వ్యక్తి గుర్తింపు గమ్యానికి మధ్య సంబంధం లేదన్నారు.

వ్యక్తి, సమాజం, రాజ్యవ్యవస్థల మధ్య ఏ విధమైన సంబంధం ఉండాలన్న అంశంపై సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. జాన్ లాక్, మంటెస్క్యూ, రూసో, సెయింట్ సైమన్ల మధ్య అతి ముఖ్యమైన విభేదాలున్నాయన్నారు. మాకియా వెల్లి, హబ్స్, బర్క్, హెగెల్ దీనికి వ్యతిరేకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. వీరు సాంప్రదాయిక రాజకీయ వ్యవస్థ లేకా చర్చి నాయకత్వపు ప్రాధాన్యతను బలపరచారు.

17వ శతాబ్దంలో శ్రేష్టతకు ప్రమాణంగా శిష్ట (Elite) పదాన్ని వాడుకలోకి తీసుకొని వచ్చారు. తరువాత కాలంలో ఉన్నత సామాజిక వర్గాలను సూచించుటకు ఈ పదాన్ని ఉపయోగించారు. 19వ వతాబ్దపు చివరి రోజుల్లో, 20వ శతాబ్దపు ఆరంభంలో ఈ పదం సమాజ, రాజనీతి శాస్త్రాలలో ప్రముఖ స్థానాన్ని సంతరించుకోలేక పోయింది. పరేటో, మోస్కా అనే ఇటాలియన్ సామాజిక శాస్త్రజ్ఞులు ఈ పదానికి ప్రాధాన్యత కల్పించారు. చరిత్రలో అన్ని దశలలో కూడా ఒక విశిష్టమైన పాలక వర్గం ఉండెడిదని, ఇది సంఖ్యాపరంగా సమాజంలో చాలా చిన్నదని. సామాజిక వనరులపై గుత్తాధిపత్యం కలిగి ఉండి తద్వారా తమ అధికారాన్ని సమాజంపై పెంచుకొనుటకు ప్రయత్నించి చాలా వరకు సఫలీకృతమయ్యారని శిష్టవర్గ సిద్ధాంతవాదులు అభిప్రాయపడ్డారు. సైనిక శక్తి మత శక్తి, ఆర్థిక శక్తి, రాజకీయ శక్తి మొదలుగా గల సామాజిక వక్తులపై శిష్ట వర్గానికి ఆధిపత్యం ఉంటుందని, కాలాన్ని బట్టి మారుతుందని శిష్టవర్గ సైద్ధాంతికుల భావన. పరేటో, మోస్కా, మిచెల్స్ మొదలగు సాంప్రదాయ శిష్ట సిద్ధాంతకర్తలు వ్యక్తుల మధ్య గల భౌతిక, నైతిక, వైజ్ఞానిక భేదాలనాధారంగా చేసుకొని తమ సిద్ధాంతాన్ని బలపరచుకొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఎటువంటి భవిష్యత్తు లేదని వీరి భావన, డీటోక్యోవెల్లి, డులెకేం లాంటి శిష్ట వర్గ సిద్ధాంతవాదులు ప్రతి సమాజంలో అన్ని దశలలో శిష్టులుంటారని, సమాజానికి వారి అవసరం తప్పని సరిగా ఉంటుందని చెబుతూ, ఈ శిష్ట వర్గాన్ని అదుపులో ఉంచకపోయిన వ్యక్తి గౌరవానికి, స్వేచ్ఛాస్వాతంత్రలకు భంగం వాటిల్ల గలదని వాదించారు. రాజ్యాంగబద్ద ప్రజాస్వామ్యంలో అదికార విభజనకు ఎంత ప్రాధాన్యముంటుందో, ఉమ్మడి అభిప్రాయాలకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. స్వతంత్ర భావాలు కలిగి పౌర విధులు, హక్కుల పౌర చైతన్యం గల స్థానిక సంస్థలు పెరుగుతూ కేంద్రీకృత అధికార వ్యవస్థను నియంత్రించగలుగుతాయి. ప్రజాస్వామ్య శిష్ట సైద్దాంతికుల వాదన. ప్రజాస్వామ్య, సాంప్రదాయ శిష్ట సిద్ధాంతవాదులకు మద్య మార్గంగా వెబర్, మాన్హీం లాంటివారు వాదించారు. శిష్ట వర్గం లేని సమాజం ఉండదని అంగీకరిస్తూ, ప్రజాస్వామ్య పద్ధతులలో రాజకీయ స్థానాల భర్తీ జరిగితే, శిష్టులకు సామాన్య ప్రజానీకానికి మధ్య దూరం తగ్గుతుందని వీరి భావన. న్యాయపాలనలో శాంతి భద్రతల నియంత్రణలో మానవుని విలువలకు, ప్రజాస్వామ్య బద్దంగా ప్రణాళికలను రూపొందించుకొనుటకు విశిష్ట వర్గానికి అవసరమని వీరి వాదన. రాజకీయ సమాజ శాస్త్ర వృద్ధిలో ఈ దశ చాలా కీలకమైనది.

సమకాలీన దశ : సమకాలీన దశలో రాజకీయ సమాజశాస్త్రం మూడు ముఖ్యమైన అంశాలపై తన దృష్టిని సారించింది. అవి రాజకీయ సమాజశాస్త్ర అభివృద్ధి క్రమం, సమాజానికి, రాజకీయాలకు సంబంధం, సామాజిక రాజకీయ వ్యవస్థలు, మార్పునకు మధ్యగల సంబందం: శక్తి, ప్రాబల్య అధికారాల ఆవిర్భాకం వాటి నిర్మాణ క్రమము ప్రక్రియ సమాజంపై వీటి ప్రభావాల అధ్యయనం ఈ దశలోని ప్రధాన అంశాలు. సమకాలీన రాజకీయ సమాజ శాస్త్రం ఈ క్రింది అధ్యయన పునాదులపై నిలచి ఉంది :

1. రాజకీయ సమాజ శాస్త్ర అధ్యయన పరిధి

2. సమాజం, రాజకీయాభివృద్ధి

3. రాజకీయ శిష్టవర్గం, వ్యవస్థ

4. స్థూల సమాజ రాజకీయ అభివృద్ది 

5. సమాజః ప్రాబల్యక శక్తి

6. సామాజిక శక్తి

7. సామాన్యప్రజానీకం


Post a Comment

0 Comments